Home » మాడిపోయిన గిన్నెలు తోమలేక ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే మీ పాత్రలు మెరిసిపోతాయి..!

మాడిపోయిన గిన్నెలు తోమలేక ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే మీ పాత్రలు మెరిసిపోతాయి..!

by Anji
Ad

సాధారణంగా పండుగ సమయంలో లేదా పెండ్లీ, మరేదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఆడవాళ్లు వంటగదిలో ఉన్నటువంటి సామాన్లంటిని తోమడానికి సిద్దమవుతుంటారు. వంట గది శుభ్రం చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని అనే చెప్పవచ్చు. అందులో మరింత కష్టం అయినది ఏదైనా ఉందంటే మాడిపోయిన గిన్నెలు, జిడ్డు, నూనె వదలని పాత్రలను తోమడమే. ముఖ్యంగా మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయాలంటే.. చేతులు నొప్పులు పుడుతుంటాయి. ఎలాంటి కష్టం లేకుండా సింపుల్ గా వాటి జిడ్డు వదిలించే సులభమైన మార్గం ఉంది. ఈ చిన్న టిప్స్ పాటించినట్టయితే మీ వంట పాత్రలు తలతల మెరిసిపోతాయి. 

Advertisement

ఉప్పు 

Salt

ఉప్పు లేనిదే ఏ వంటకు రుచి రాదు. అదేవిధంగా భోజనం రుచి పెంచడమే కాదు.. వంటగదిని శుభ్రం చేస్తుంది. జిడ్డుగా ఉన్నటువంటి పాత్రలను గోరు వెచ్చని నీటిలో పెట్టి అందులో కాసింత ఉప్పు వేసి గంటపాటు ఉంచాలి. అప్పుడు స్కైబర్ ని ఉపయోగించి తోమితే వెంటనే జిడ్డు వదిలిపోతుంది. అదేవిధంగా పాత్రలను శుభ్ర పరిచే మరో మార్గం ఏమిటంటే.. డిటర్జెంట్ ని ఉప్పులో కలిపి ఆ మిశ్రమాన్ని పాత్రలపై వేసుకోవాలి. 30 నిమిషాల పాటు తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.

Advertisement

నిమ్మరసం, బియ్యపునీరు 

Manam News

జిడ్డు లేదా మాడిన పాత్రలను బియ్యం నీటిలో నానబెట్టాలి.  30 నిమిషాల తరువాత స్క్రబ్ తీసుకొని దానిని తోముకోవాలి. ఈ మిశ్రమంలో స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ మురికి, జిడ్డుని సులువుగా వదిలిస్తుంది. 

Also Read :  పిల్ల‌లు భూతులు మాట్లాడ‌టానికి 5 కార‌ణాలు..మాట్లాడ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి..!

వెజిటబుల్ ఆయిల్ 

Manam News

సాధారణంగా నూనెవల్ల జిడ్డు పడుతుంది. నూనెతో మరీ జిడ్డు వదిలించడం ఏంటని ఆలోచిస్తున్నారా..? కానీ ఇది చక్కని చిట్కా.. వెజిటబుల్ ఆయిల్ ని ఉపయోగించి జిడ్డు, మాడిపోయిన పాత్రలను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ వెజిటబుల్ ఆయిల్ లో నిమ్మరసం, ఉప్పు, పంచదార వేసుకొని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాత్రల మీదపోసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నానబెట్టిన తరువాత రఫ్ స్క్రైబర్ తో తుడిచి వేడి నీటితో కడగాలి. ఇక మీ పాత్రలు మిలమిల మెరిసిపోతాయి. 

Also Read :   మెంతికూర ఇలా తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading