Home » hansika marriage: హన్సిక పెళ్లి ఖర్చుతో ఒక ఊరిని బాగు చేయొచ్చు.. ఎన్ని కోట్లంటే..?

hansika marriage: హన్సిక పెళ్లి ఖర్చుతో ఒక ఊరిని బాగు చేయొచ్చు.. ఎన్ని కోట్లంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని తనదైన నటనతో మంచి పేరు సంపాదించుకుంది..ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో అంతగా నిలదొక్కుకోలేకపోయింది. కానీ కోలీవుడ్ లో మాత్రం తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. అలాంటి హన్సిక పెళ్లి ముంబై కి చెందిన బడా వ్యాపారవేత్త సోహెల్ ఖతురియాతో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ వివాహం జైపూర్ లోని రాజకోట్ లో జరిగింది. అలాంటి హన్సిక వివాహానికి అయిన ఖర్చుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read:పెళ్లి తరువాత మొదటి సారి తన భర్త కోసం హన్సిక ఏం వండిందో తెలుసా ?

Advertisement

హన్సిక పెళ్లికి మూడు రోజుల ముందు నుంచే అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.. మెహందీ,హల్ది, సంగీత్ వంటి ఫంక్షన్లు గ్రాండ్ గా చేశారు. అయితే హన్సిక ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలుస్తోంది.. దాదాపుగా పెళ్లి కోసం 20 కోట్లకు పైగానే ఖర్చుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

హిందూ సంప్రదాయం ప్రకారం హన్సిక సోహెల్ ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటుగా సన్నిహితులు హాజరయ్యారు. ఈ తరుణంలో ఆమె పెళ్లి ఖర్చు బయటకు రావడంతో హన్సిక ఇంత ఖర్చు పెట్టి వివాహం చేసుకుందా.. ఆ డబ్బుతో ఒక ఊరును బాగు చేయొచ్చు అంటూ నెటిజెన్లు ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఖర్చును చూసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.. మరి ఈ పెళ్లి ఖర్చుపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి..

also read:అవతార్ 2 సెన్సార్ పూర్తి.. నిడివి గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading