Home » సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను ట్రెండ్ సెట్ట‌ర్ అని ఎందుకంటారు..? 10 కార‌ణాలు ఇవే..!

సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను ట్రెండ్ సెట్ట‌ర్ అని ఎందుకంటారు..? 10 కార‌ణాలు ఇవే..!

by AJAY
Ad

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ హీరోగా నటించిన తరంలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ ఆయనను ట్రెండ్ సెట్టర్ అని పిలిచేవారు. అలా పిలవడానికి పది కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ట్రెండ్ సెట్టర్ గా నిలవడానికి కృష్ణ ఎన్నో సాహసాలు చేశారు. అప్పటి వరకు కౌబాయ్ సినిమాల రుచి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులకు కృష్ణ కౌబాయ్ సినిమాలను పరిచయం చేశారు.

Advertisement

ఆ తర్వాత చాలామంది హీరోలు కౌబాయ్ సినిమాల‌లో నటించినా కృష్ణకు వచ్చిన క్రేజ్ మరే హీరోకు రాలేదు. అంతేకాకుండా తొలి ఈస్ట్ మాన్ కలర్ సోషల్ సినిమా కూడా కృష్ణదే కావడం విశేషం. అదేవిధంగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఈ సినిమా 1974లో విడుదలైంది. ఈ సినిమాతో టాలీవుడ్ కు కృష్ణ ఫస్ట్ సినిమా పరిచయం చేశాడు. 1986లో వచ్చిన సింహాసనం సినిమాతో 70 ఎం ఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ ఫిలింను కృష్ణ టాలీవుడ్ కు పరిచయం చేశాడు.

Advertisement

1995 వ సంవత్సరంలో కృష్ణ తెలుగు వీర లేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఫస్ట్ డిటిఎస్ చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అంతేకాకుండా గూడచారి 116 సినిమాతో టాలీవుడ్ కు స్పై జోన‌ర్ ను పరిచయం చేసింది కూడా కృష్ణ కావడం విశేషం. అదేవిధంగా 1967 వ సంవత్సరంలో అవేకళ్ళు సినిమాతో కృష్ణ టాలీవుడ్ కు మర్డర్ మిస్టరీ జోనర్ ను పరిచయం చేశారు.

వీటితోపాటు కృష్ణ సింహాసనం సినిమాతో బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బ‌ప్పి లహరిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత బప్పి లహరి చాలా సినిమాలకు స్వరాలు సమకూర్చారు. 1967 వ సంవత్సరంలో సాక్షి సినిమా మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అయింది. మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అయిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో పాటు 2004లో శాంతి సందేశం సినిమాలో కృష్ణ నటించారు. ఈ సినిమాలో కృష్ణ ఏసుక్రీస్తు పాత్ర‌లో నటించారు. అప్పటి స్టార్ హీరోలు ఎవరూ అలాంటి పాత్ర చేసే సాహసం చేయలేదు.

Visitors Are Also Reading