సినిమాల్లో హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే సాహసం అనే చెప్పాలి. ఇండస్ట్రీ హిట్ అని పిలవాలి అంటే ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి అప్పటి వరకూ వచ్చిన సినిమాల రికార్డులను తిరగరాయాలి అప్పుడే ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ అని అంటారు. అయితే కొందరు స్టార్స్ ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కొట్టి టాప్ లో నిలిచారు.ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…ఇప్పటి వరకూ మొత్తం 40 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అంతే కాకుండా చిరంజీవి,ఏన్ఆర్ ఎక్కువ ఇండస్ట్రీ హిట్ లను కొట్టిన హీరోలు.
Advertisement
వీరిద్దరూ ఒక్కొక్కరూ ఏడు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఏఎన్ఆర్ కు మొదట బాలరాజు మొదటి ఇండస్ట్రీ హిట్ ఆ తరవాత ఆరు ఇండస్ట్రీ హిట్ లను ఇచ్చాడు. చిరంజీవి మొదట పసివాడి ప్రాణం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తరవాత మరో ఆరు ఇండస్ట్రీ హిట్స్ లో నటించాడు.
Also Read: ఉదయం ఖాళీ కడుపుతో నల్ల శనగలు నానబెట్టిన నీటిని తాగితే ప్రయోజనాలు ఎన్నో..!
Advertisement
2002లో చివరిసారి ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. అదే విధంగా అన్నగారు ఎన్టీఆర్ మొదటి సారి పాతాలభైరవి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఆ తరవాత మరో నాలుగు ఇండస్ట్రీ హిట్ లలో నటించాడు. అన్నగారి చివరి ఇండస్ట్రీ హిట్ సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర…
ఇక ఎన్టీఆర్ కు ఇదే మొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తరవాత బాలయ్య ఖాతాలో మరో మూడు ఇండస్ట్రీ హిట్ లు చేరాయి.
బాలయ్య చివరగా నరసింహనాయుడు సినిమాతో చివరగా ఇండస్ట్రీ హిట్ పడింది. ఇక వెంకటేష్ నాగార్జున, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు లకు చెరో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఏఎన్ఆర్ తరవాత బ్యాక్ టూ బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరోగా ప్రభాస్ నిలిచాడు.
Also Read: ఆ హీరోయిన్ కి దిల్ రాజు అంత పారితోషికం ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా ?