Home » ఉదయం ఖాళీ కడుపుతో నల్ల శనగలు నానబెట్టిన నీటిని తాగితే ప్రయోజనాలు ఎన్నో..!

ఉదయం ఖాళీ కడుపుతో నల్ల శనగలు నానబెట్టిన నీటిని తాగితే ప్రయోజనాలు ఎన్నో..!

by Anji
Ad

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. శనగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది శనగలను తింటుంటారు. కానీ శనగలను నానబెట్టిన నీటిని పారబోస్తుంటారు. వీటిలో కూడా చాలా పోషక విలువలుంటాయి. నల్ల శనగలను శుభ్రంగా కడిగి రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని జాలితో వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. శనగలు నానబెట్టిన నీటిని మన ఆరోగ్యానికి అమృతం అని నిపుణులు చెబుతుంటారు. 

Advertisement

ముఖ్యంగా ఈ నీటిని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదేవిధంగా అలసట, నీరసం వంటివి లేకుండా రోజు అంతా చాలా చురుకుగా పాల్గొంటారు. డయాబెటిస్ ఉన్న వారు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే ఖాలీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది. పైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల గ్యాస్, అజీర్ణం, మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.  

Advertisement

Also Read :   కష్టసమయంలో మనిషి సుఖంగా జీవించాలంటే డబ్బుని ఇలా ఖర్చు చేయాలి..!

Manam News

చర్మాన్ని అంతర్గతంగా శుభ్రపరిచి చర్మం యవ్వనంగా ఉండేవిధంగా చేస్తుంది. నీటిలో ఫైబర్ ప్రోటీన్, కాల్షియం, విటమిన్ లు ఉంటాయి. శరీరంలోని అనేక సమస్యలను తొలగిస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. నల్ల శనగల నీటిని అలాగే తాగవచ్చు. ఈ నీటిలో ఉప్పు, నిమ్మరసం లేదా తేనే కూడా కలుపుకొని తాగవచ్చు. గోరువెచ్చగా చేసి కూడా తాగవచ్చు. ఇలా తాగడం కుదరదు అని ఈ నీటిని చపాతి పిండి కలిపినప్పుడు ఉపయోగించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలున్న నల్ల శనగలు నానబెట్టిన నీటిని రోజూ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి. 

Also Read :  చలికాలంలో బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు..!

Visitors Are Also Reading