నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మి, గజరాజ్, కరుణాస్, కాళీ వెంకట్, రెడిన్ కింగ్స్లీ, హరీష్ పేరడి, అజయ్, శత్రు, మునిష్కాంత్,శ్రీజ రవి
దర్శకులు : చెల్లా అయ్యావు
Advertisement
నిర్మాత: విష్ణు విశాల్
స్టూడియోస్, RTT టీమ్వర్క్స్
సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
కథ :
ఈ సినిమా కథంతా ఒక గ్రామీణ పల్లెటూరులో జరిగే కథ. ఎలాంటి లక్ష్యం లేకుండా వీర ( విష్ణు విశాల్) అనే వ్యక్తి జీవితంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా బతుకుతాడు. దీంతో వారి కుటుంబం ఆయనకు వివాహం చేయాలనుకుంటుంది. కానీ ఆ వ్యక్తి అనిగిమని ఉండే భార్యను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. చివరికి కీర్తి ( ఐశ్వర్య లక్ష్మి) అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆమె అణిగిమనిగి ఉండే అమాయకురాలని అనుకుంటాడు. కానీ అమ్మాయి దీనికి పూర్తిగా వ్యతిరేకం. తరచు గ్రామాల్లో ఉండే ప్రతి గొడవల్లో తల దురుస్తుంది. వారి కుటుంబం దగ్గర అమాయకంగా నటిస్తుంది. చివరికి ఈ విషయం వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది. వీరిద్దరూ కలిసి ఉంటారా. కుస్తీ క్రీడలో వీర పాల్గొనడానికి కారణం ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
Advertisement
సినిమా ఎలా ఉంది అంటే :
వీరా క్యారెక్టర్ లో విష్ణు చాలా బాగా నటించారు. మొదటి భాగం కంటే రెండో భాగం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగంలో కాస్త కామెడీ సన్నివేశాలు ఉన్నా రెండో భాగంలో ఆయన కుస్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు. ఇక అప్పటినుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇందులో ముఖ్యంగా ఐశ్వర్య లక్ష్మీ తన నటనతో చాలా ఆకట్టుకుంటుంది.ఓ వైపు దూకుడు మరోవైపు అమాయక అమ్మాయిగా రెండు కోణాల్లో అందరిని మెప్పిస్తుందని చెప్పవచ్చు. మిగిలిన నటీనటులు కూడా వారి వంతు కృషితో అందరిని సందడి చేస్తారు. ప్రేమ కథలో క్రీడను కలపడంలో కాస్త విఫలమయ్యారని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే కామెడీ ఇందులో ఉంది. సాంకేతికంగా చూస్తే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో అతిపెద్ద మైనస్ జస్టిస్ ప్రభాకరన్ పాటలు. మెలోడీ పాటలలో ఎంతో పేరు పొందిన ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరులో దూసుకుపోయారని చెప్పవచ్చు. మొత్తానికి మట్టి కుస్తీ ఓసారి కంపల్సరిగా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ
ఎమోషన్స్
మైనస్ పాయింట్స్ :
పాటలు
సాంకేతిక నిర్మాణం
రొటీన్ స్టోరీ
రేటింగ్ :2.5/5
also read: