Home » Big boss6: శ్రీహాన్, ఇనయ మరి ఇంత దారుణమా..అలా చేశారేంట్రా బాబు..!

Big boss6: శ్రీహాన్, ఇనయ మరి ఇంత దారుణమా..అలా చేశారేంట్రా బాబు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్బాస్ సీజన్ 6 ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో అట్టహాసంగా కొనసాగుతోంది. వారం వారం ప్రేక్షకులకు మరింత ఉత్కంఠ కలిగించే విధంగా షో కొనసాగుతోంది.. ఇప్పటికే 12 వారాలు పూర్తయి 13వ వారం వచ్చేసరికి 8 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. దీంతో బిగ్ బాస్ వారి కోసం “టికెట్ టూ ఫినాలే” టాస్కుని పెట్టింది. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా నేరుగా ఫైనల్ కి వెళ్తారని తెలియజేసింది.. ఈ టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించడానికి అవసరమైన ముక్కలని పైనుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే స్లో మెన్ ను ముందుగా ఎవరు రెడీ చేస్తారో వారే విజేతగా నిలుస్తారు. దీనికి సంచలక్ గా ఇనయని నియమించారు.

Advertisement

also read:“హిట్ -2” సినిమా రివ్యూ…అడ‌విశేషుకు హిట్ ప‌డిందా..?

బిగ్ బాస్ మొదటి దశలో రేవంత్ మరియు ఆదిరెడ్డి ఎక్కువ ముక్కలను సేకరించి స్నోమాన్ తయారు చేశారు. అలాగే రోహిత్, పైమా,కీర్తి మాత్రం గేమ్ నియమాలకు విరుద్ధంగా సేకరించిన వస్తువులను వారి వద్ద పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సంచాలకుగా ఉన్నటువంటి ఇనాయ గుర్తించలేదు. దీంతో బిగ్ బాస్ ఇనయ తొలగించి రేవంత్ ను సంచాలక్ పెట్టారు. రేవంత్ వచ్చి రాగానే కఠిన నిర్ణయాలు అమలు చేశాడు. ఈ విధంగా రెండవ లెవెల్ మొదలవుతుంది. ఇందులో భాగంగానే స్టార్ట్ ఎండ్ బజార్ల మధ్య ఉన్న టైంలో బొమ్మలపై దాడి చేసి వీలైనన్నీ వస్తువులను తొలగించవచ్చని బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చారు. కానీ పోటీదారులు పెద్దగా గొడవకు ఏమీ దిగలేదు. తొలగించడం పక్కనబెట్టి వారి బొమ్మలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేశారు.

Advertisement

ఇనయ మాత్రం శ్రీహాన్ బొమ్మపై దాడి చేసేందుకు ట్రై చేసింది. ఈ సందర్భంలోనే ఇనయాను శ్రీహాన్ గట్టిగా హత్తుకొని ఆయన బొమ్మ వద్దకు వెళ్లకుండా చేశాడు. ఈ క్రమంలోనే ఒకరు ఒకరు లాక్కోవడం, పట్టుకోవడం రొమా**క్ గా వ్యవహరించారు. ఈ విషయాన్ని శ్రీ సత్య గమనించి అసలు వీరిద్దరూ ఏం చేశారు అని అడిగితే, ఇనయ సిగ్గుపడుతూ ఎటాక్ చేసామని చెప్పింది. అది ఎటాక్ లా లేదు, కావాలంటే టెలికాస్ట్ లో చూసుకోండి అని శ్రీ సత్య అంది. ఇంతటితో ఆగకుండా బాగానే చేశావు దొరికిపోయావు శ్రీహాన్ అంటూ ఆట పట్టించింది.. అంతేకాకుండా రేవంతు, పైమా ఏకంగా వీరిద్దరు ఏ విధంగా చేశారో దాన్ని ఇమిటేట్ చేసి చూపించారు. కానీ శ్రీహాన్, ఇనయా మాత్రం దీన్ని కామెడీగానే తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించింది సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading