తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి మేటి హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి అంటే తెలియని వారు ఉండరు.. తన చెరగని అందం, నటన అభినయంతో ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ రెండు తరాల హీరోలతో తెరను పంచుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ లను తన అంద చందాలతో ఊపు ఊపేసిందని చెప్పవచ్చు.. ఎన్టీఆర్,ఏఎన్నార్, తరం నాటి హీరోలతో నటించి అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాతి వారి వారసులుగా వచ్చిన తరం నాటి హీరోలతో కూడా నటించి మెప్పించింది ఈ అమ్మడు.
also read:హిట్ చిత్రాల్లో మంచి పాత్రలను మిస్ చేసుకున్న 6 హీరోయిన్స్.. 2చాలా ఇంపార్టెంట్.!
Advertisement
నాగార్జున,వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోలతో చేసింది. 1970లో కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అలాంటి శ్రీదేవి బాలకృష్ణతో రెండు సినిమాలు మిస్ అయ్యాయి దీనికి ప్రధాన కారణం బాలయ్య తండ్రి ఎన్టీఆర్. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. 1987 గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్లో బాలయ్య హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా “సామ్రాట్” సినిమా చేద్దామని అనుకున్నారట.
Advertisement
కానీ ఆయన తండ్రి ఎన్టీఆర్ కు ఈ కాంబినేషన్ నచ్చకపోవడంతో రిజెక్ట్ అయింది. ఈ విధంగా మొదటిసారి రావలసిన సినిమా మిస్ అయింది. దీని తర్వాత 1989లో మరో సెన్సేషనల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “భలే దొంగ” సినిమాలో శ్రీదేవి బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటింపజేయాలని అనుకున్నారట.. అంతా ప్లాన్ చేశారు.. ఇక సినిమా చేసే సమయంలో మాత్రం కొంతమంది నందమూరి అభిమానులు ఈ ప్రయత్నానికి అడ్డుకట్ట వేశారట దీనివల్ల అప్పుడు మరోసారి వీరికి కాంబో మిస్సయింది. ఈ విధంగా భలే దొంగ సినిమాలో శ్రీదేవి ప్లేస్ లో విజయశాంతిని తీసుకున్నారు. ఇక దీని తర్వాత బాలయ్య శ్రీదేవి కాంబినేషన్ సెట్ చేసేందుకు ఎవరు కూడా ప్రయత్నాలు చేయలేదట.
also read: