Home » రాశి స్టార్ హీరోయిన్ కావడానికి కారణం చిరు భార్య సురేఖ అని తెలుసా..!!

రాశి స్టార్ హీరోయిన్ కావడానికి కారణం చిరు భార్య సురేఖ అని తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలోమెగాస్టార్ కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ భార్య సురేఖది ఎంత మంచి మనసో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె వల్లే ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది రాశి.. ఈ విషయం చాలామందికి తెలియదు.. మరి ఆమె ఏం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాశి పవన్ కళ్యాణ్ గోకులం సీత సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రంలో రాశికి ఛాన్స్ రావడం వెనక చాలా పెద్ద కథ నడిచింది.

Advertisement

also read:“ఆట” శ్రీవిద్య జీవితంలో ఇంత విషాదం ఉందా…? ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..?

Advertisement

ఈ కథలో చిరంజీవి భార్య సురేఖ ఉందని సమాచారం. ప్రముఖ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత మూవీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ముందు రాశి శుభాకాంక్షలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలో రాశి అందం, అభినయం చాలామందిని ఆకట్టుకుంది.. అయితే అప్పటికే రాశి కుటుంబంతో సురేఖకు పరిచయం ఉంది. చిరంజీవికి చెన్నైలో ఇల్లు ఉన్న సమయంలో చిరంజీవి భార్య సురేఖ రాశి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఆమెను పిలిపించారట.

 

మోడ్రన్ డ్రెస్సులో ఫోటోషూట్ చేసి గోకులంలో సీత పాత్ర రాశి పర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించిందట. దీంతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య కు రాశీని పరిచయం చేసి గోకులంలో సీత సినిమాలో నటించే విధంగా రికమెండ్ చేసింది. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత రాశికి వరుస ఆఫర్లు రావడంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక అప్పటి నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది.. ఈ విధంగా సురేఖ రాశి కెరీర్ ని మలుపు తిప్పడంలో ఎంతో ఉపయోగపడిందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading