సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీ అయినా డైరెక్టర్ ఆ చిత్రానికి సంబంధించి కథను ఆయ హీరోయిన్ లేదా హీరో ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులను ఊహించుకొని వారికి అనుగుణంగా రాస్తూ ఉంటారు.. ఇలా చివరి వరకు ఆ పలాని హీరో హీరోయిన్ ఈ సినిమాలో చేస్తారని భావిస్తూ ఉంటారు. కానీ తీరా ఈ రాసుకున్న కథను హీరో లేదా హీరోయిన్ కు వినిపించినప్పుడు రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
దీనికి కారణం వారికి కథ నచ్చకనో, లేదంటే ఇతరత్ర సినిమాలకు ఓకే చెప్పి డేట్స్ కుదరకనో, లేదంటే ఇతర కారణాలు ఏవైనా కావచ్చు ఆ సినిమా వారి దగ్గరికి వచ్చినా వారు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు సినిమా ఇండస్ట్రీలలో అనేకం చూస్తూనే ఉన్నాం.అయితే ఈ సినిమాల్లో ఈ స్టార్ యాక్టర్స్ రిజెక్ట్ చేసిన ఆ పాత్రలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వీరు ఎందుకు రిజెక్ట్ చేశామని బాధపడ్డ రోజులు కూడా అనేకం ఉన్నాయని తెలియజేస్తున్నారు. మరి అలా హీరోయిన్లు మిస్ చేసుకున్న మంచి సినిమాలు ఏంటో మనము ఓ లుక్ వేద్దాం..
#1.రాశి రంగమ్మత్త పాత్ర :
Advertisement
సీనియర్ హీరోయిన్ రాశిని రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్ర కోసం అడిగారట. కానీ ఆమె ఒప్పుకోకపోవడం వల్ల ఆ పాత్ర అనసూయకి వెళ్ళింది.
#2.శ్రీదేవి శివగామి పాత్ర:
బాహుబలి చిత్రంలో శివగామి పాత్రను ముందుగా శ్రీదేవిని వరించిందట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర రమ్యకృష్ణ కి వెళ్ళింది. రమ్యకృష్ణకి ఇది మరింత స్టార్డం తెచ్చిందని చెప్పవచ్చు.
Advertisement
#3. నిజం మూవీ మహేష్ తల్లి పాత్ర:
ముందుగా నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్ర కోసం జయసుధాను సంప్రదించారట. ముందుగా ఓకే కూడా చెప్పిందట. కానీ ఇతర సినిమాలు ఒప్పుకోవడం వల్ల డేట్స్ కుదరక ఆ మూవీ నుంచి తప్పుకున్నారట.
also read:పుట్టిన పిల్లలకు వెంటనే కన్నీళ్లు ఎందుకు రావు..!!
#4.చెన్నకేశవరెడ్డి లయ:
చెన్నకేశవరెడ్డి చిత్రంలో చెల్లి పాత్రకు లయను అడిగారట. కానీ స్టార్ హీరో పక్కన చెల్లిగా చేయడం ఏంటి అని, తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా పనికిరారా అంటూ ఎమోషనల్ అయి తప్పకుందట లయ.
#5.విద్యాబాలన్ సీత పాత్ర:
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ముందుగా సీత పాత్రకు విద్యాబాలను సంప్రదించారట. కానీ ఈమె నో చెప్పడంతో ఆ సినిమా మిస్ అయింది.
#6.విజయశాంతి తల్లి పాత్ర:
రాజా ది గ్రేట్ సినిమాలో విజయశాంతిని తల్లి పాత్ర చేయడానికి ముందుగా సంప్రదించారట. కానీ ఈవిడ నో చెప్పడంతో రాధిక గారిని తీసుకున్నారట.
also read: