Home » రాజకీయాల వల్ల చాలా నష్టపోయా…దండం పెడుతూ బండ్ల గణేష్ ఎమోషనల్…!

రాజకీయాల వల్ల చాలా నష్టపోయా…దండం పెడుతూ బండ్ల గణేష్ ఎమోషనల్…!

by AJAY
Ad

బండ్ల గణేష్ టాలీవుడ్ లో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి ఓ రేంజ్ లో ఎదిగాడు. తీన్మార్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా చాలా నష్టపోయాడు. కానీ గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండు మూడు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించాడు. కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

 

ఇక పవన్ కళ్యాణ్ అవకాశమిస్తే ఎప్పటికైనా ఆయనతో సినిమా నిర్మిస్తానని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కాదు. బండ్ల గణేశ్ 2014 ఎలక్షన్ల సమయంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

Advertisement

Advertisement

ఇక బండ్ల గణేష్ ఏం మాట్లాడినా వార్తల్లో వైరల్ అవ్వడం పక్కా…. సినిమా ఫంక్షన్లలో సైతం బండ్ల గణేష్ అదే తీరుని ప్రదర్శిస్తాడు. ఇక ఒకప్పుడు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన బండ్ల గణేష్ గత కొద్ది రోజుల క్రితం తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానంటూ ప్రకటించాడు.

ఇక తాజాగా ఆయన సోషల్ మీడియాలో రాజకీయాల వల్ల చాలా నష్టపోయాను.. నాకు ఏ రాజకీయ పార్టీతో రాజకీయ నాయకులతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే… అంటూ దండం పెడుతున్న ఎమోజీలను బండ్ల గణేష్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading