సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఓ రేంజ్ లో పాపులారిటీ ఉంటుంది. అదేవిధంగా దర్శకులకు సైతం గుర్తింపు దక్కుతుంది. కానీ హీరోలకు దర్శకులకు లైఫ్ ఇచ్చే నిర్మాతలకు మాత్రం పెద్దగా గుర్తింపు రాదు. కానీ ఒకప్పుడు నిర్మాతగా ఎన్టీఆర్… ఏఎన్నార్ లాంటి స్టార్ల నుండి చిరంజీవి నాగార్జున లాంటి హీరోలతో సినిమాలు చేసిన నిర్మాత డి. రామానాయుడు కు ఎంతో పాపులారిటీ వచ్చింది. కేవలం సినిమాలను నిర్మించడమే కాకుండా చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు వచ్చినప్పుడు హైదరాబాదులో రామానాయుడు స్టూడియోను నిర్మించి చిత్తసీమకు ఎంతో సేవ చేశారు.
Also Read: పూజా హెగ్డేకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..ఆమె వద్ద ఉన్న 8 ఖరీదైన వస్తువులు చూస్తే..!!
Advertisement
సినిమాలే తన జీవితంగా బ్రతికి ఎన్నో సూపర్ హిట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రామనాయుడు కుమారుడు డి. సురేష్ బాబు ప్రస్తుతం తండ్రి బాటలో నడుస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఇక మరో కుమారుడు దగ్గుబాటి వెంకటేష్ హీరోగా రానిస్తున్నారు. అంతేకాకుండా రామానాయుడు మనవడు రానా సైతం ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు.
Advertisement
Also Read: సుధీర్ పోస్టర్ ను హత్తుకుంటున్న నాని.. గొప్ప నటుడు అంటూ కితాబు..!!
కానీ రామానాయుడు సక్సెస్ వెనక ఓ వ్యక్తి ఉన్నారు. ఆవిడ గురించి ఎవ్వరికీ తెలియదు. రామానాయుడు సక్సెస్ వెనకాల ఉన్నది ఆయన సతీమని రాజేశ్వరి గారు. రామానాయుడు సక్సెస్ వెనక రాజేశ్వరి కృషి ఎంతో ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. రామానాయుడు ఊర్లో వ్యవసాయం చేస్తుండగా సినిమాలు చేయాలని ఆలోచన వచ్చిందట. అయితే ఆయన సన్నిహితులు అందరూ నిరాశపరిస్తే సతీమణి రాజేశ్వరి మాత్రం తన భర్తను ప్రోత్సహించిందట.
రామానాయుడు తన మేనమామ కూతురు అయిన రాజేశ్వరిని పట్టుబట్టి మరి వివాహం చేసుకున్నారట. రామానాయుడు కుటుంబానికి అప్పట్లో వందల ఎకరాల భూములు ఉండగా రాజేశ్వరి సైతం ఆయనతో వెళ్లి వ్యవసాయ పనులను పర్యవేక్షించేవారట. అంతేకాకుండా రామానాయుడు ఇండస్ట్రీకి వెళతానని చెప్పినప్పుడు రాజేశ్వరి తను దాచుకున్న డబ్బు మొత్తం ఆయనకు ఇచ్చారట. అలా ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది అనే సామెతను రాజేశ్వరి గారు నిరూపించారు.
Also Read: సోషల్ మీడియాలో ఆ స్టార్ హీరోలను దాటేసిన రామ్ చరణ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..!