Telugu News » Blog » సోషల్ మీడియాలో ఆ స్టార్ హీరోలను దాటేసిన రామ్ చరణ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..!

సోషల్ మీడియాలో ఆ స్టార్ హీరోలను దాటేసిన రామ్ చరణ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..!

by Anji
Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. తన టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాల్లో నటించి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా గడుపుతున్నారు. 

Advertisement

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్ విషయాలను షేర్ చేస్తుంటాడు చరణ్. చరణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లను చూసి అభిమానులు సంబురపడుతుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి దాదాపు 20లక్షల మంది ఫాలోవర్స్ ఫాలోవర్స్ పెరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం విశేషం.  సోషల్ మీడియాలో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుని ప్రభాస్ మహేష్ బాబు వంటి హీరోలను  బీట్ చేశారు.  

Advertisement

Also Read :  రామానాయుడి స‌క్సెస్ వెన‌క ఆయ‌న స‌తీమణి కృషి ఇంత ఉందా..? ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు ఇవే..!

Prabhas, Mahesh

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో 9 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. పాన్ ఇండియా సినిమాల్లో నటించని సూపర్ స్టార్ మహేష్ బాబుకి 9.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరు స్టార్ హీరోలను బీట్ చేస్తూ రామ్ చరణ్ 10 మిలియన్స్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో 20 మిలియన్స్ ఫాలోవర్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి స్థానంలో ఉండగా.. 17 మిలియన్స్ ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ తరువాత స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ 10 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో మరో సినిమా చేయనున్నాడు. 

Advertisement

Also Read :  ఉదయ్ కిరణ్ డబ్బు లేక చనిపోయాడు అనేది అబద్దం.. అసలు నిజం ఏంటంటే : దిల్ మూవీ నటుడు