తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ కమెడియన్ గా పేరు పొందారు ఆలీ. ఆయన పలు సినిమాల్లో హీరోగా కూడా చేశారు. అంతటి నటన టాలెంట్ ఉన్న ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీఎం జగన్ తో పాటు పలువురు స్టార్ సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ తరుణంలోనే ఆలీ అల్లుడు గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తారు..
Advertisement
also read:కాజల్ కి ఏమైంది..ఆ స్టార్ హీరోకు కోపం ఆమెను బ్యాన్ చేయండంటూ..!!
వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఫాతిమా ఆలీ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉంటూ డాక్టర్ కోర్స్ పూర్తిచేసి వారి కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయింది.ఇక ఆలీ అల్లుడు విషయానికి వస్తే జమీలా బాబి, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహ్యాజ్. ఆయనకు ఒక అన్నయ్య,ఒక సోదరి ఉన్నారు. షెహ్యాజ్ అన్నయ్య వదినతో పాటు తన సోదరి కూడా డాక్టరే. వీరంతా లండన్ లో ఉంటారు. షెహ్యాజ్ కుటుంబం ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ ఎంతో ఉన్నత కుటుంబం. ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో షెహ్యాజ్ కూడా ఎంతో కష్టపడి డాక్టర్ చదివారు..
Advertisement
ఇక ఆలీ కూడా తన కుమార్తె డాక్టర్ కావడంతో అల్లుడు కూడా డాక్టర్ కావాలని ఏరి కోరి మరీ సంబంధాన్ని ఓకే చేశారట. షెహ్యాజ్ కుటుంబం గుంటూరుకు చెందినవారు. ఈ విధంగా అలీ కుమార్తె పెళ్లి సందడి సందడిగా సకుటుంబ సపరివార సమేతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా జరిగింది అని చెప్పవచ్చు.. ఈ వివాహానికి సంబంధించి అలీ వైఫ్ ప్రతి అప్డేట్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది. ఇది చూసిన ఆలీ అభిమానులంతా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
also read: