మూవీ మొఘల్ గా పేరు పొందిన స్టార్ నిర్మాత డాక్టర్ దగ్గు బాటి రామనాయుడు.ఈయన కేవలం తెలుగులోనే మాత్రమే కాదు.. దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఎన్నో చిత్రాలను తీశారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో దర్శకులను, నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత రామానాయుడుకి దక్కుతుంది. టాలీవుడ్ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రతుకు-బ్రతికించు అనే సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.. దానిని ఆచరించి చూపిన మహానీయుడు రామానాయుడు. ప్రతీ పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు. అదేవిధంగా రామానాయుడు విజయం వెనుక ఆయన సతీమణి రాజేశ్వరి పాత్ర ఎంతో ఉంది. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కుమారులతో పాటు లక్ష్మీ అనే కూతురు జన్మించారు.
Advertisement
గ్రామంలో చేస్తున్న వ్యవసాయం వదిలేసి సినీ రంగానికీ వెళ్లాలని నిర్ణయించుకున్న రామానాయుడిని అందరూ నిరుత్సాహ పరిచారు. రాజేశ్వరి మాత్రం వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించింది. రామానాయుడు ఒంగోలులోని తన బంధువు బిబిఎల్ సూర్యనారాయణ ఇంట్లో ఉంటూ ఎస్ఎస్ఎల్ సి చదివే సమయంలో అక్కడే ఉన్న తన మేనమామ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఆ సమయంలో రాజేశ్వరిని చూసి మనసు పారేసుకున్నాడు రామానాయుడు. అప్పటికే ఓ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేసే వారు. ఇక రాజేశ్వరిని తప్ప మరొకరినీ పెళ్లి చేసుకోను అని రామానాయుడు తండ్రికి చెప్పడంతో కొడుకు మాట కాదనలేక ఆ అమ్మాయితోనే పెళ్లి చేశారు. ఆ రోజుల్లోనే వందల ఎకరాలలో సేద్యముండేది. భర్తతో పాటు పొలానికి వెళ్లి కూలీ పనులు పర్యవేక్షించడమే కాదు.. తాను కూడా కాయకష్టం చేసేది.
Advertisement
Also Read : తల్లిదండ్రులు మరణించినా తలనీలాలు తీయని మహేష్ బాబు.. ఎందుకో తెలుసా ?
రూపాయి విలువ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో వచ్చిన ఆదాయంలో బాగానే పొదుపు చేసేది రాజేశ్వరి. ఆమె ఇలా పొదుపు చేసిన విషయం రామానాయుడికి అస్సలు తెలియదట. సినీ రంగానికి వెళ్లడానికి వీలుగా ఒక్కసారిగా లక్షల్లో డబ్బు ఇచ్చేసరికి రామానాయుడు ఆశ్చర్యపోయాడట. తాను చిన్నప్పటి నుంచి దాచిన సొమ్ము అని చెప్పడంతో రామానాయుడు కళ్లు తిరిగిపోయాయట. రాజేశ్వరి హస్తవాసి ఎలాంటిదంటే.. చేతి డబ్బు తీసుకొని సినీ రంగానికి వెళ్లిన రామానాయుడికి పట్టిందల్లా బంగారం అయింది. ఆయన తీసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. కొడుకులు కూడా ప్రయోజకులయ్యారు. వెంకటేష్ కూడా స్టార్ హీరోగా ఎంతోపేరు తెచ్చుకున్నాడు. సురేష్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇలా తమ కుటుంబాన్ని చక్కదిద్దిన రాజేశ్వరి తన మనవడు నాగచైతన్య పెళ్లిలో కూడా ఎంతో హుషారుగా కనిపించింది. పెళ్లి కొడుకు తరపున రాజేశ్వరి తెచ్చిన చీరనే సమంత ధరించిందట. ఆ చీరను రీ మోడలింగ్ ప్రత్యేకంగా తయారు చేశారు డిజైనర్ క్రేశా బజాజ్. ఈ శారీ కోసం అప్పట్లోనే రూ.40లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం.