Home » itlu maredumilli prajaneekam movie review : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ అండ్ రేటింగ్…!

itlu maredumilli prajaneekam movie review : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ అండ్ రేటింగ్…!

by AJAY
Published: Last Updated on
Ad

పరిచయం :

అల్లరి సినిమాతో పరిచయమైన నరేష్ ఆ తర్వాత అన్నీ కామెడీ చిత్రాల్లోనే నటించాడు. అయితే ఇప్పుడు అల్లరి నరేష్ నాంది సినిమా తో రూటు మార్చాడు. కేవలం కామెడీ సినిమాల్లో కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తున్నాడు. ఇక తాజాగా నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం…

Advertisement


Itlu maredumilli prajaneekam movie Story సినిమా కథ :

శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) ఒక గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తుంటాడు. గవర్నమెంట్ టీచర్ అయిన శ్రీనివాస్ శ్రీపాదకు ఎలక్షన్ డ్యూటీ పడుతుంది. దాంతో డ్యూటీ పై మారేడుమిల్లి గ్రామానికి చేరుకుంటాడు. అయితే అప్పటివరకు మారేడుమిల్లి అనే గ్రామం ఉందని ఎవరికీ తెలియదు. సమాజానికి దూరంగా ఉన్న ఆ గ్రామ ప్రజలను… వారి కష్టాలను బయట ప్రపంచానికి తెలియజేయాలని నరేష్ అనుకుంటాడు. దానికోసం నరేష్ పోరాటం కూడా మొదలుపెడతాడు. అప్పుడే సినిమా కథలో ఊహించని మలుపులు వస్తాయి. ఇక గ్రామ ప్రజల కోసం నరేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు..? చివరికి తాను అనుకున్నది సాధించాడా లేదా..? అన్నది ఈ సినిమా కథ.

Advertisement

itlu maredumilli prajaneekam movie Revie in Telugu విశ్లేషణ :

నాంది సినిమా తర్వాత నరేష్ మరోసారి అద్భుతమైన పాత్రలో నటించాడు. సమాజంలోని వాస్తవ సంఘటనలకు అద్దం పట్టేలా సినిమా ఉంది. రాజకీయ నాయకులు ప్రజలను ఓట్ల కోసం ఏ విధంగా వాడుకుంటారు… అనేదాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. స్కూల్ టీచర్ గా ఎలక్షన్ ఆఫీసర్ గా నరేష్ తన పాత్రలో ఒదిగిపోయారు. నరేష్ కి జోడిగా నటించిన హీరోయిన్ ఆనంది తన పాత్రకు న్యాయం చేసింది.

అదే విధంగా సినిమాలో వెన్నెల కిషోర్ ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా దర్శకుడు తన చెప్పాలనుకున్నది నేరుగా చెప్పాడు. సినిమాలో మరికొన్ని ఎమోషనల్ సన్నివేశాలు జోడించి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. థియేటర్ నుండి మంచి ఆలోచనలతో బయటకు వస్తారు.

Also Read: Hit 2 Movie Review in Telugu “హిట్ -2” సినిమా రివ్యూ

Visitors Are Also Reading