నటీనటులు : వరుణ్ ధావన్, కృతిసనన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబాక్, దీపక్ డోబ్రియాల్, సౌరభ్ శుక్లా తదితరులు.
నిర్మాత : దినేష్ విజన్
Advertisement
తెలుగులో విడుదల : అల్లు అరవింద్
సంగీతం : సచిన్ జిగార్
దర్శకత్వం : అమర్ కౌశిక్
ఎడిటర్ : సంయుక్త కాజా
విడుదల తేదీ : నవంబర్ 25, 2022
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. ఏ భాషలో సినిమా తీసినా దానిని మిగతా భాషల్లో డబ్బింగ్ చేసి పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. హిందీలో వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా భేడీయా. తెలుగులో తోడెలుగా వచ్చింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉంది ? ముఖ్యంగా కాంతార తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో డబ్బింగ్ గా వచ్చిన తోడెలు సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
THODELU MOVIE Story :
ఢిల్లీకి చెందిన భాస్కర్ (వరుణ్ ధావన్ ) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ అటవీ ప్రాంతో రోడ్డు వేసే కాంట్రాక్టు దక్కించుకుంటాడు. అడవిలో చెట్లు నరికి రోడ్డు పనులు పూర్తి చేయాలనుకుంటాడు. ప్రకృతి ఏమైపోయినా పర్వాలేదు. కానీ తనకు రోడ్డు వేయడం ద్వారా వచ్చే డబ్బే ముఖ్యమని పేర్కొంటాడు. భాస్కర్ ని అనుకోకుండా తోడేలు కరుస్తుంది. దీంతో భాస్కర్ తోడేలు గా మారిపోతాడు. అసలు భాస్కర్ ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు కొంత మందిని మాత్రమే దాడి చేసేవాడు? వెటర్నరీ డాక్టర్ అనైక (కృతిసనన్) నుంచి భాస్కర్ కి ఎలాంటి వైద్యం చేసింది ? అనైకతో భాస్కర్ ప్రేమ ఫలించిందా ? రోడ్డు నిర్మించాలనుకున్న భాస్కర్ ప్రయత్నం ఏమైంది ? అనేది తెలియాలంటే తోడేలు సినిమా చూడాల్సిందే.
Also Read : మెస్సీ జెర్సీలో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?
Advertisement
THODELU MOVIE REVIEW in Telugu
కథ పరంగా తోడేలు చాలా కొత్తదనం కనిపిస్తోంది. దాదాపు రెండున్నర గంటలు ఆ కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు అమర్ కౌశిక్ కొంత తడబాటుకు లోనయ్యారనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి తరహా సినిమా రాలేదనే చెప్పాలి. అయితే ఆసక్తికరంగా ప్రారంభమైన సినిమాను మధ్యలో సాగదీశారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినప్పటికీ కథను విస్తరించిన తీరు చాలా బాగుంది. ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం మైనస్. ఇక క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా మలిచాడు. సీరియస్ అంశాలను కూడా బోర్ కొట్టించకుండా కామెడీ వేలో చూపించారు. విజువల్స్, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అందాలు, తోడేలు విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి.
ఈ చిత్రానికి వరుణ్ ధావన్ ప్రధాన బలం అనే చెప్పాలి. తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తోడేలుగా మారుతున్న సమయంలో ఆశ్చర్యపోయేలా అతని నటన ఉంది. వరుణ్ ధావన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. డాక్టర్ అనైకగా కృతిసనన్ మెప్పించింది. కొన్ని సీన్లు, డైలాగ్ విషయంలో మొహమాటాలు లేకుండా చేశారు. ముఖ్యంగా తోడేలుగా మారే సన్నివేశాలు కామెడీ టైమింగ్ విషయంలో వరుణ్ ధావన్ నటనలో విలీనమయ్యారు. సచిన్ జిగార్ సంగీతం ఆకట్టుకుంది. జిష్ణు భట్టాచార్జి కెమెరా పనితీరు కూడా అద్భుతంగా ఉంది. మొత్తానికి మనిషి తోడేలుగా మారితే అనే కొత్త కాన్సెప్ట్.. తోడేలు కరిచిన తరువాత వచ్చే సన్నివేశాలు కొత్త అనుభూతిని ఇస్తాయి. మొత్తానికి సన్నివేశాల నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. పూర్తి సంతృప్తినివ్వడంలో విఫలం చెందింది తోడేలు.
Also Read : LOVE TODAY MOVIE REVIEW : ఎమోషన్స్ తో యువతను మెప్పిస్తోందా ?