హైదరాబాద్ లోని మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి అస్వస్థత ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష అని సీఆర్పీఎఫ్ వాళ్లు తన కొడుకును ఛాతిపై కొట్టారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో తన కొడుకును కూడా చూడనివ్వలేదన్నారు. 200 మంది ఐటీ అధికారులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
Advertisement
నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వైఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షపత్రాలు సీఎం పంపిణీ చేయనున్నారు.
భద్రాద్రి ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకుని ఘటనా స్థలాన్ని ఎస్పీ వినీత్ పరిశీలించారు.
Advertisement
ఢిల్లీ నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ హాజరుకానున్నారు. యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు.
డిసెంబర్ నెల కోటాకు సంబంధించి ఈనెల 24న ఉదయం 10 గంటలకు వృద్ధులు, వికలాంగుల సర్వదర్శనం టిక్కెట్లను టిటిడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులకు ఊరట కల్పించారు. అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్‌లోనే తమ వెంట తీసుకువెళ్లొచ్చని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సర్క్యులర్ జారీ చేసింది.
తెలంగాణలో MLAల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10:30కి విచారిస్తామన్న హైకోర్టు బెంచ్.. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమ ముందు ఉంచాలన్న హైకోర్టు.. విచారణకు సహకరించడం లేదన్న విషయాన్ని ఏజి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.