Home » కృష్ణ-విజయనిర్మల పెళ్లి.. ఇందిరాదేవి నిర్మలను ఎలా చూసేవారో అసలు నిజాలు చెప్పిన మేకప్ మాన్ మాధవరావు..!!

కృష్ణ-విజయనిర్మల పెళ్లి.. ఇందిరాదేవి నిర్మలను ఎలా చూసేవారో అసలు నిజాలు చెప్పిన మేకప్ మాన్ మాధవరావు..!!

by Sravanthi
Ad

తెలుగు వారి గుండెల్లో సూపర్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్నారు హీరో కృష్ణ. అనారోగ్యంతో నవంబర్ 15వ తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగు ఇండస్ట్రీలోనే తన స్టైల్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఏకైక హీరో కృష్ణ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనకు ఒక్కసారిగా అభిమానిగా మారిన వ్యక్తులు ఆయన అంతిమయాత్ర వరకు ఆయన తోడుగానే ఉన్నారని ఆ యాత్రలో వచ్చిన ఫ్యాన్స్ ని చూస్తే అర్థం చేసుకోవచ్చు.

Advertisement

also read;సుధీర్ బాబును అల్లుడిగా చేసుకునేందుకు మొదట కృష్ణ ఎందుకు ఒప్పుకోలేదు…? ఆ తరవాత ఏం జరిగిందంటే…?

అలాంటి కృష్ణ గురించి ఆయన వ్యక్తిగత మేకప్ మాన్ మాధవరావు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. కృష్ణ గారి దగ్గర మాధవరావు మేకప్ మ్యాన్ గా నమ్మిన వ్యక్తి.. దాదాపు శ్రీ శ్రీ సినిమా వరకు ఆయనే పనిచేశారట.. అలాంటి మాధవరావు కృష్ణ విజయ నిర్మల గారి గురించి మాట్లాడుతూ.. వారి జీవితంలో వారు ఎన్నో దానధర్మాలు అందించారని, విజయనిర్మల చనిపోయే ముందు కూడా నేను ఇల్లు కొనుక్కోవాలి అంటే 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు.ఈ విధంగా కృష్ణ విజయనిర్మల గొప్పతనం గురించి తెలియజేశారు..

Advertisement

అంతేకాకుండా ఇందిరా దేవి నన్ను అన్నయ్య అని పిలిచేవారు, నా భార్యను వదిన అని పిలుస్తుండేవారు. ఆప్యాయంగా పలకరించేవారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక విజయనిర్మలను కృష్ణ పెళ్లి చేసుకున్నప్పుడు ఇందిరా దేవి గారు మొదట్లో కాస్త కోపంగా ఉన్నా రోజులు గడిచిన కొద్దీ సర్దుకుపోయారని తెలియజేశారు. విజయనిర్మల గారిని పెళ్లి చేసుకున్నాక ఇందిరాకు, మహేష్ బాబు మరియు అతని చెల్లెలు పుట్టారని చెప్పారు. ఆయన ఎవరిని తక్కువ చూడకుండా ఇద్దరినీ బాగానే చూసుకున్నారని, పిల్లలకు కూడా సమ న్యాయం చేశారు. ఇక విజయనిర్మలను ఇందిరా దేవి కూడా గౌరవప్రదంగానే చూసుకునేవారని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

also read;కృష్ణ అంత్యక్రియల విషయం లో మహేష్ బాబు తప్పు చేశాడా…?

Visitors Are Also Reading