పవిత్రాలోకేష్ నరేష్ ల వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను నరేష్ పవిత్రలు ఖండించలేదు. దాంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తేలిపోయింది. అంతే కాకుండా ఓ హోటల్ లో నరేష్ మూడో భార్య పవిత్రాలోకేష్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాడి చేసే ప్రయత్నం చేసింది.
Advertisement
ఆ తరవాత కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్న పవిత్ర నరేష్ ఇప్పడిప్పుడిప్పుడే మళ్లీ బయటకు వస్తున్నారు. రీసెంట్ గా ఇద్దరూ కలిసి నటించిన ఓ సినిమా కోసం కలిసి వీడియోను విడుదల చేశారు. అంతే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ ఆస్పత్రిలో ఉన్న సమయంలో నరేష్ పవిత్రతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. నరేష్ పవిత్ర కలిసి ఆస్పత్రికి వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
కాగా ఆ వీడియో చూసిన నెటిజన్లు నరేష్ పై ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు సైతం నరేష్ పై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా నరేష్ కృష్ణల బంధం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ నిర్మల కుమారుడు నరేష్ అంటే కృష్ణకు పెద్దగా ఇష్టం ఉండేది కాదని అన్నారు.
అంతే కాకుండా కృష్ణ మృతి చెందిన తరవాత నరేష్ పవిత్రతో రావడం పై ఇమంది రామారావు అసహనం వ్యక్తం చేశారు. కృష్ణ మరణించిన తరవాత నరేష్ పవిత్రతో వస్తే కృష్ణ ఫ్యామిలీకి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. సహజీవనం చేస్తే చేశాడు కానీ అలా రావడం భావ్యం కాదని అన్నారు. అంతే కాకుండా అలా రావడం కృష్ణగారి ఫ్యామిలీ తలదించుకునే పరిస్థితి రావడమే కాకుండా కృష్ణగారి ఆత్మకూడా శాంతించదని మండిపడ్డారు.