ఇండియాలో బాలీవుడ్ అనేది పెద్ద సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే హిందీ మాట్లాడే జనాలు ఇండియాలో ఎక్కువ ఉండేవారు. అయితే మిగితా భాషల్లో కూడా సపరేట్ సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి కానీ.. అవి అన్ని బాలీవుడ్ తర్వాతే అనే ఫీలింగ్ అందరికి ఉండేది. అలాగే ఒకానొక సమయంలో సౌత్ సినిమాలను బాలీవుడ్ వారు ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Advertisement
కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక్కడ తెరకెక్కి డబ్ అయ్యి హిందీలో విడుదల అవుతున్న సినిమాలు అక్కడి సినిమాలను వెన్నకి నెట్టేస్తున్నాయి. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ పైన సౌత్ సినిమాల రాజ్యం అనేది నడుస్తుంది. కానీ ఈ క్రెడిట్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళిదే అంటున్నాడు కేజిఎఫ్ హీరో యష్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా హిందీలో సూపర్ హిట్ అందుకుంది.
Advertisement
ఈ సినిమా తర్వాతే అక్కడి జనాలు సౌత్ సినిమాలను చూడటం ప్రారంభించారు. ఆ తర్వాతే ఎన్నో సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదల్ అయ్యి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. దీనంతటికి రాజమౌళినే కారణం అని యష్ అన్నాడు. అయితే యష్ కూడా బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవల్ లో వచ్చిన కేజిఎఫ్ సినిమా వల్లే దేశ వ్యాప్తంగా పేరు అనేది సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :