Home » ఎన్టీఆర్ సినిమా చేస్తా అంటున్న కాంతారా డైరెక్టర్..!

ఎన్టీఆర్ సినిమా చేస్తా అంటున్న కాంతారా డైరెక్టర్..!

by Azhar
Ad

కొన్ని సినిమాలో ఎటువంటి సౌండ్ లేకుండా థియేటర్ లోకి వచ్చి పెద్ద బ్లాస్ట్ చేస్తాయి అనేది తెలిసిందే. ప్రస్తుతం అటువంటి సినిమానే కాంతారా. కన్నడలో కేవలం 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అనేది అక్కడ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అనేవి సాధించింది. ఈ సినిమాను కేజిఎఫ్ నిర్మాణ సంస్థ నిర్మించడంతో.. మిగితా భాషలో రిలీజ్ చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కాంతారా సూపర్ హిట్ అనిపించుకుంది.

Advertisement

దాంతో కాంతారా సినిమా దర్శకుడు, హీరో అయిన రిషబ్ శెట్టికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా హీరోలు, డైరెక్టర్లు కూడా ఆయనను మెచ్చుకుంటున్నారు. అయితే ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఈ విషయాని స్వయంగా రిషబ్ శెట్టి నే పేర్కొన్నాడు. అనంతరం ఎన్టీఆర్ తో సినిమా అనేది చేయడం పై రిషబ్ శెట్టి కొన్ని ఆసక్తికర కామెంట్స్ అనేవి చేసాడు.

Advertisement

రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ అందరూ దర్శకులకు ఉన్నట్లే నాకు కూడా ఉంది. కానీ ఇప్పుడు నేను చేయాలి అనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఓ కథ అనేది రాసుకున్న తర్వాతే నటి నటులను ఎంపిక చేసుకునే అలవాటు ఉంది. కానీ ఏ హీరో కోసమే అని నేను కథ రాయను. కాబట్టి ఎన్టీఆర్ ను సెట్ అయ్యే కథ నేను ఎప్పుడు రాస్తే అప్పుడే నేను ఆయనతో సినిమా చేస్తా అని రిషబ్ శెట్టి పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియాలో ఇండియా జట్టుకు భద్రత లేదా..?

ఫైనల్ లో తలపడనున్న ఇండియా, పాకిస్థాన్..?

Visitors Are Also Reading