అనసూయ ఎప్పటి నుండో టాలీవుడ్ లో ఉంది. కానీ మొదట్లో ఆమెకు పేరు కానీ.. అవకాశాలు కానీ ఎక్కువగా వచ్చేవి కావు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలోకి అనసూయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకు మంచి పేరు అనేది వచ్చింది. అలహీ జనాలలో గుర్తింపు కూడా ఈ షో వల్లే అనసూయకు వచ్చింది అనేది అందరికి తెలుసు. ఇక ఈ జబర్దస్త్ వల్ల సినిమా అవకాశాలు కూడా బాగానే అందుకుంది.
Advertisement
కానీ తాజాగా అనసూయ జబర్దస్త్ ను వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో ఎక్కువ నటించడానికే నేను జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నాను అని అనసూయ చెప్పింది. ఇక ప్రస్తుతం అనసూయ పెద్ద పెద్ద సినిమాలో నటిస్తుంది. పుష్ప సినిమాలో నటించిన అనసూయ.. తాజాగా చిరంజీవి గాడ్ ఫాధర్ సినిమాలో కూడా మంచి పాత్రలోనే చేసింది. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అనసూయకు మంచి అవకాశాలు అనేవి వస్తున్నాయి.
Advertisement
అయితే వచ్చిన అవకాశాని వదిలి పోనివ్వకుండా బాగానే వినియోగించుకుంటున్న అనసూయ.. రెమ్యునరేషన్ కూడా మంచిగానే వసూల్ చేస్తుంది అని తెలుస్తుంది. అందుకే ఈ మధ్య అనసూయ ఆస్తులు అనేవి భారీగా పెరుగుతున్నాయి అని సమాచారం. ప్రస్తుతం అనసూయ ఆస్తులు మొత్తం దాదాపుగా 25 కోట్ల వరకు ఉంటాయి అని తెలుస్తుంది. అయితే ఇంకా కూడా మంచి ఫామ్ లో ఉన్న అనసూయ.. ఆస్తులు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి అనేది అందరికి అర్ధం అవుతుంది.
ఇవి కూడా చదవండి :