Home » సూర్యను అందుకోవడం పాక్ ప్లేయర్స్ వల్ల అవుతుందా..?

సూర్యను అందుకోవడం పాక్ ప్లేయర్స్ వల్ల అవుతుందా..?

by Azhar
Ad

సూర్య కుమార్ యాదవ్… గత ఏడాది నుండి ఈ పేరు అనేది క్రికెట్ ప్రపంచంలో బిగా వినిపిస్తుంది. అయితే ఎన్నో ఏళ్ళు ఐపీఎల్ లో బాగా రాణించిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ కు ఇండియా జట్టులోకి గత ఏడాది ఎంట్రీ అనేది ఇచ్చాడు. కానీ ఈ ఏడాదిలోనే భారత జట్టులో బెస్ట్ టీ20 బ్యాటర్ అయ్యాడు సూర్య కుమార్ యాదవ్.

Advertisement

అయితే సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే ఈ ఏడాది టీ20 లో అత్తవైదిక రన్స్ చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ కంటే ముందే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి వచ్చాడు. కానీ వెంటనే మళ్ళీ కిందకి వచేసాడు. సూర్యకు పోటీగా పాకిస్థాన్ ఆటగాళ్లు రిజ్వాన్, బాబర్ ఆజాం ఉన్నారు.

Advertisement

ఇక ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే అతనికి పోటీ ఉన్న పాక్ ఆటగాళ్లు విఫలం కావడంతో సూర్య కుమార్ యాదవ్ మళ్ళీ తాజాగా మొదటి స్థానానికి వచ్చాడు. అయితే ఈసారి మొదటి స్థానంలో ఉన్న సూర్య వద్ద 863 పాయింట్స్ ఉంటె రెండో స్థానంలో ఉన్న రిజ్వాన్ కు 842 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే సూర్య వద్ద 21 పాయింట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మరి ఈ గ్యాప్ ను పాక్ ప్లేయర్స్ పూర్తి చేస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి :

బంగ్లా పై భారత్ మూడు మార్పులు చేస్తుందా..?

ఇండియా మళ్ళీ చీటింగ్ చేసిందంటున్న పాకిస్థాన్..!

Visitors Are Also Reading