భారత ప్రధాని నరేంద్ర మోడీని తమిళ హీరో విశాల్ పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా కాశీ ఎంతో బాగుందని, గంగానది చాాలా పవిత్రంగా మారిందని చెప్పుకొచ్చారు. ఇదంతా ప్రధాని మోడీ వల్లనే అని, మోడీ ప్రధాని అయిన తరువాతనే ఇదంతా అభివృద్ధి జరిగిందని విశాల్ ట్వీట్ చేశాడు.ఒక తమిళ హీరో ఇలా ట్వీట్ చేయడం ఏంటని. మోడీని హీరో విశాల్ పొగడటంతో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
Advertisement
ఒకప్పుడు ప్రధానిని తిట్టిన వారు ఇప్పుడు ఇలా పొగుడుతున్నారేంటని నెటిజన్లు పేర్కొంటున్నారు. దేశం మొత్తం మీద గుజరాత్ ఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ఘటనలో ఇప్పటికే 100 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది గల్లంతయ్యారు. ఇది ప్రధాని సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో జరగడంతో అందరూ ప్రధానిని విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రధాని వస్తున్నాడని రాత్రికి రాత్రి మోర్బీ ఆసుపత్రిని ప్రక్షాళన చేయడం మీద కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి.
Also Read : రాజమౌళి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన రెండు సినిమాలు ఏవో తెలుసా..? ఆ స్టార్ హీరో సినిమా కూడా.?
Advertisement
Dear Modiji, I visited #Kasi, Had a wonderful Darshan/Pooja & touched #HolyWater of #GangaRiver. God bless U for the transformation U hav done to the #Temple by renovating & making it look even more wonderful & easy for anyone to visit #Kasi, Hats off, Salute U@narendramodi
— Vishal (@VishalKOfficial) October 31, 2022
ఇలాంటి సమయంలో మోడీని పొగుడుతూ విశాల్ ట్వీట్ వేయడంతో నెటిజన్లు హీరో విశాల్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. కాశీ, గంగానది కనిపిస్తొందా ? గుజరాత్ లో మరణించిన వ్యక్తులు, వారి కుటుంబాలు కనిపించడం లేదా.. అక్కడి కేబుల్ బ్రిడ్జీ తెగి అంత మంది చనిపోతే స్పందించలేదు. కానీ వీటిపై ట్వీట్లు వేస్తున్నావా? అటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య విశాల్ సినిమాలు కూడా అంతగా ఆకట్టుకుంటలేవనే చెప్పాలి. మరోవైపు మూస ధోరణిలో సినిమాలు తీస్తున్నాడంటూ కూడా నెటిజన్లు చర్చించుకోవడం గమనార్హం.
Also Read : బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తో మెగాస్టార్ డిన్నర్..!