టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నా ప్రియమణి.. అవకాశాలు తగ్గిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ అనేది ప్రియమణి ప్రారంభించిన విషయం తెలిసిందే. నారప్ప సినిమాల్లో భార్యగా, తల్లిగా ప్రియమణి చేసిన నటన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కు బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాది వచ్చిన విరాటపర్వం సినిమాలో నాక్స్లైట్ అక్కగా నటించి కూడా అభిమానులను మెప్పించింది ప్రియమణి.
Advertisement
అయితే ఇప్పుడు ఏకంగా సీఎం గానే ప్రియమణి కనిపించబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో తీఫా వైరల్ అవుతుంది. అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా అనేది చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చైతన్యకు జంటగా… కృతి శెట్టి నటించనుంది. అయితే ఈ సినిమా మొత్తం పాలిటిక్స్ చుట్టూ తిరగనుంది అని తెలుస్తుంది.
Advertisement
ఇక ఈ సినిమాలో ప్రియమణి నటిస్తుంది అని ఇప్పటికే అధికారిక ప్రకటన రాగ.. ఇందులో ఆమె రాజకీయ నాయకురాలిగా కనిపించబోతుంది అని తెలుస్తుంది. అయితే సినిమా మొదటి భాగంగా పొలిటీషియన్ గా కనిపించే ప్రియమణి… సెకండ్ ఆఫ్ లో సీఎం అవుతుంది అని టాక్ వినిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈ సీఎం పాత్రలో ప్రియమణి ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా లేదా అనే అనుమానం ఫ్యాన్స్ కు కలుగుతుంది.
ఇవి కూడా చదవండి :