ప్రస్తుతం జీవన విధానం రోజు రోజుకు పూర్తిగా భిన్నంగా మారిపోతుంది. ముఖ్యంగా ఉరుకుల పరుగుల జీవితంలో కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. దీంతో అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. మనిషికి నిద్ర ఆహారం లేనిది ఏ పని చేయలేడు. సరిగా నిద్ర లేకపోతే ఆ రోజంతా యాక్టివ్ గా ఉండలేరు. ఏ పని చేయాలన్నా సరిగా చేయలేరు. అలసిపోవడం, నీరసంతో రోజంతా కష్టపడి గడపాల్సి వస్తుంది. మరి ఆరోగ్యకరమైన జీవితానికి ఎన్ని గంటలు నిద్రపోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఒక వ్యక్తికి శారీరకంగా, మానసికంగా, విశ్రాంతి చాలా అవసరం. అయితే దీర్ఘకాలంగా సమస్యలు ఉన్నవారు నిద్రలేమితో నానా తంటాలు పడుతుంటారు. మరి ఆరోగ్యంగా ఉండటానికి కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం తప్పనిసరి. అనేక రకాల సమస్యలు వస్తాయి. తలనొప్పి కళ్ళు తిరగడం ఫ్రెష్ గా అనిపించకపోవడం, కళ్ళు మూసుకుపోవడం, యాక్టివ్ గా ఉండకపోవడం వంటివి నిద్రలేమికి ప్రధాన లక్షణాలు. నిద్రలేమి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు జ్ఞాపకశక్తి తగ్గుదల అధిక రక్తపోటు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. కొంతమంది రాత్రి పూట ఆరు నుండి ఏడు గంటలు నిద్రపోతారు మళ్ళీ పగటి సమయంలో గంట నిద్రపోతారు.
Advertisement
Also Read : విక్రమ్ ‘తంగలాన్’ మరో అపరిచితుడు అవుతుందా ?
అయితే ఇది మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు అలాగే రోజు ఒకే సమయంలో నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి లేదంటే సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడొచ్చు కొంతమంది నిద్ర పట్టకపోతే నిద్రమాత్రలు వేసుకుంటారు కానీ ఇది శరీరంపై అనేక దుష్ఫలితాలను చూపిస్తుంది అలాగే మరి కొంతమంది నిద్రకు ముందు ఫోన్ టీవీ ఎక్కువగా చూస్తుంటారు కానీ ఇది మంచి అలవాటు కాదు అందుకే పడుకోవడానికి మూడు గంటల ముందు కాఫీ తీసుకోకూడదు అలాగే రాత్రిపూట తక్కువ తింటే మంచి నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.