Home » భరణం తీసుకోలేదంటున్న రేణూ దేశాయ్ ఇచ్చానంటున్న పవన్….! అసలు నిజం ఏంటి…?

భరణం తీసుకోలేదంటున్న రేణూ దేశాయ్ ఇచ్చానంటున్న పవన్….! అసలు నిజం ఏంటి…?

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. నిజానికి పవన్ కేవలం సినిమాలలోనే కొనసాగితే ఆయనను విమర్శించే వాళ్ళు ఉండేవారు కాదు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. దాంతో ఇతర పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ ను విమర్శించినప్పుడల్లా మూడు పెళ్లిళ్ల విషయాన్ని మీడియా కి లాగి విమర్శిస్తూ ఉంటారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే పవన్ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తనపై విమర్శలు చేస్తున్న వారి పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. మూడు పెళ్లిళ్లు అని అంటున్నారు సరదాగా ఉంటే మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారు. ఒక పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలను మెయింటైన్ చేస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు. అంటూ గాటుగా స్పందించాడు. తను మూడు పెళ్లిళ్లు చేసుకున్నమాట వాస్తవం అని అన్నారు.

Advertisement

మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చానని, రెండో భార్యకు తన ఆస్తిలో సగం ఇచ్చానని…. రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మూడో పెళ్లి చేసుకున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్యతో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ లకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అన్నా లేజోనోవాను వివాహం చేసుకున్న సమయంలో రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చారు. అయితే విడాకుల సమయంలో రేణు దేశాయ్ చాలా భరణం తీసుకున్నారని వార్తలు వినిపించాయి. దాంతో ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ స్పందించింది.

తాను భరణంగా ఒక రూపాయి కూడా తీసుకోలేదని… ఏమి తీసుకోకుండా బయటకు వచ్చానని చెప్పింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లగ్జరీ ఇంటిని, కారును కోనుగోలు చేసి ఇచ్చాడని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. దానిపై స్పందించిన రేణు దేశాయ్ బాధపడుతూ ….తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో వాటిని కొనుక్కున్నానని చెప్పింది. అయితే ఇప్పుడెమో పవన్ కళ్యాణ్ తన ఆస్తిలో సగం రెండో భార్యకు ఇచ్చానని చెప్పడంతో మరోసారి ఈ విషయం చర్చగా మారింది. భరణం విషయం లో రేణూ దేశాయ్ అబద్ధం చెప్పిందా…? లేదంటే పవన్ కళ్యాణ్ అబద్ధం చెబుతున్నాడా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading