భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి కొన్నేళ్ల కిందట మరణించిన విషయము తెలిసిందే. ప్రతీక్ రెడ్డి పేరు మీద ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వెంకటరెడ్డి. తాజాగా నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సహకారంతో ప్రతిఖ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో మాదాపూర్ 250 ఒక కంపెనీలో పాల్గొన్నాయి.
Advertisement
ఈ కంపెనీలలో 20 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 20,000 ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు దాదాపు 60000 మంది నిరుద్యోగులు తరలివచ్చారు. వారిలో 18 వేల మంది ఉద్యోగాలు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ బీటెక్ విద్యార్థికి ఫ్యాక్ట్ సెట్ కంపెనీ 9 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ జాబ్ మేలాకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రవీందర్ హాజరయ్యారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు.
Advertisement
Also Read : చిరంజీవితో చెప్పులు కుట్టించిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?
అనంతరం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో పాల్గొని మంచి అవకాశాలు సాధించారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న అభ్యర్థులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : భరణం తీసుకోలేదంటున్న రేణూ దేశాయ్ ఇచ్చానంటున్న పవన్….! అసలు నిజం ఏంటి…?