Home » ‘కాంతార’ మూవీ హీరోకు జూనియర్ ఎన్టీఆర్‏కు ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా ?..

‘కాంతార’ మూవీ హీరోకు జూనియర్ ఎన్టీఆర్‏కు ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా ?..

by Anji
Ad

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కాంతార పేరు మారు మోగుతుంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రూపొందించిన ఈ సినిమాకు ఇండియన్ బాక్సాపీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కర్ణాటకలో దూసుకుపోతున్న ఈ సినిమా అక్టోబర్ 15న తెలుగులోనూ విడుదల అయింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేశారు. కేరళలోని కాంబ్లా, బూటాకోలా సాంప్రదాయ సంస్కృతిని తెలియజేస్తూ… హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి. ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి.. తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని.. అలాగే తనకు మధ్య కనెక్షన్ ఉందని చెప్పారు.

Also Read : “గాడ్ ఫాదర్” సినిమాలో సత్య దేవ్ పాత్రను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోలు ఎవరో తెలుసా…? ఎందుకు వదులుకున్నారు అంటే…?

Advertisement

Advertisement

రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. “తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోస్ ఉన్నారు. కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అతనితో నాకు మరొక అనుబంధం కూడా ఉంది. అది ఏంటంటే.. ఎన్టీఆర్ అమ్మగారు మా గ్రామానికి చెందిన వారే.” అని చెప్పుకొచ్చారు. అలాగే మీ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తారా..? అని ప్రశ్నించగా.. ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు లేవని. కథ.. కాన్సెప్ట్ వచ్చినప్పుడే డిసైడ్ చేసుకోగలను అని తెలిపారు. రిషబ్ శెట్టి కర్ణాటకలోని ఉడిపిలో గల కుందపుర గ్రామానికి చెందినవారు.

Also Read : కొత్త‌గా పెళ్లైన ఆడ‌పిల్ల త‌ల్లికి రాసిన ఉత్త‌రం..చ‌దివితే క‌న్నీళ్లు పెట్ట‌కుండా ఉండ‌లేరు..!

మరోవైపు రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార సినిమాకు టాలీవుడ్, కోలీవుడ్ హీరోస్ మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కిచ్చా సుదీప్, తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇక శుక్రవారమే హిందీలో విడుదలైన ఈ చిత్రానికి ఉత్తరాది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం విశేషం.

Also Read : ‘కాంతారా’ ని మించిన క్లైమాక్స్ ‘స‌లార్‌’ లో ఉంటుందా..?

 

Visitors Are Also Reading