రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారు ఎవ్వరుండరు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవ్వడం విశేషం. ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా ఆశించిన మేర ఆకట్టుకోలేదు. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్, సెప్టెంబర్ లో సలార్ సినిమాలు విడుదల కానున్నాయి.
Advertisement
Also Read : పూనమ్ కౌర్‌కి పెళ్లి అయిందా..? అందుకే అలా చేసిందా ?
తాజాగా ప్రభాస్ రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా’ సినిమాను రెండు సార్లు చూశానని.. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని చెప్పాడు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే కేజీఎఫ్, కాంతారా సినిమాలను నిర్మించింది హోంబల్ నిర్మాణ సంస్థనే సలార్ సినిమాని కూడా నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్ లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Advertisement
Also Read : Kantara Movie Review :”కాంతార” మూవీ రివ్యూ.. రేటింగ్.. క్లైమాక్స్ అదిరిపోలా..!!
ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు భారీ హైప్ క్రియేట్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే కేజీఎఫ్, తాజాగా కాంతారా సినిమాలు సెన్సేషన్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కాంతారా సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవడం విశేషం. ఈ క్లైమాక్స్ చూసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ బాగా ఎంజాయ్ చేశాడట. తమ సలార్‌లో క్లైమాక్స్ ని కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసే రేంజ్ లో నిలబెడతామని ఓ అప్‌డేట్‌ని రివీల్ చేశారు. దీంతో సలార్ క్లైమాక్స్ అంశం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేసింది.
Also Read : నయనతార చెల్లెలు డబ్బులోనే కాదు.. చదువులో కూడా..!