వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. గృహ, వాహన రుణాలపై మరింత భారం పడనుంది. 5.4 శాతం నుంచి 5.9 శాతానికి రెపోరేటు పెంచింది. ఏడాదిలో ఆర్బీఐ 4 సార్లు వడ్డీరేట్లు పెంచింది.
సాంకేతిక లోపంతో హైదారాబాద్ మెట్రో ట్రైన్స్ 6 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సిబ్బంది మెట్రో ట్రైన్ల స్పీడ్ తగ్గించి నడుపుతున్నారు.
Advertisement
భారత్‌లో కొత్తగా 3,938 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9 మంది మరణించగా…. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 39,538 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
హైదరాబాద్ బేగంపేటలో ఎంఎంటీఎస్‌కు ముప్పు తప్పింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో ఎంఎంటీఎస్ ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీసారు.
Advertisement
నేడు సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో ఉదయం 11.30 కేసీఆర్ యాదాద్రికి చేరుకోనున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహంచనున్నారు. విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సీఎం సమర్పించనున్నారు.
నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం జరగనుంది. ద్రవ్యోల్బణం అదుపునకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉంది.
రేపటి నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు అమల్లోకి రానుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు రేపు ఆఖరు తేదీగా ఉంది. సీనియర్ నేతలు చిదంబరం, మల్లిఖార్జున ఖర్గే, ఏకే ఆంటోనీలతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్నట్టు సమాచారం.
నాగర్ కర్నూల్ లో 36 మంది పంచాయతీ కార్యదర్శుల్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. గ్రామపంచాయతీ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు చెల్లించలేదని సస్పెన్షన్ వేటు వేశారు.