Home » పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి కుమారవేల్, జయ మోహన్ లు సంయుక్తంగా కథను అందించారు. 1955 లో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కించార‌ట‌. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. మొద‌టి భాగం సెప్టెంబ‌ర్‌ 30న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాశ్ రాజ్ త‌దిత‌ర నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

Advertisement

పొన్నియిన్ సెల్వన్ లో కనిపించే వారంద‌రూ స్టార్లు కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెల‌కొన్నాయి. అలాగే ఈ స్టార్ నటీ నటులు పొన్నియిన్ సెల్వన్ కోసం ఎంత వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే విష‌యంపై చాలా మంది నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా సినీ సర్కిల్స్ లో పొన్నియిన్ సెల్వన్ నటీ నటుల రెమ్యునరేషన్ లిస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

Advertisement

దీని ప్రకారం.. పొన్నియిన్ సెల్వన్ లో ప్రధాన పాత్ర చేస్తున్న చియాన్ విక్రమ్ అత్యధికంగా రూ. 15 కోట్లు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ. 10 కోట్లు, జయం రవి 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు, త్రిష రూ. 2 కోట్లు తో పాటు ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య లక్ష్మీ ఒక్కొ కోటీ తీసుకున్నారని తెలుస్తోంది. అంటే ప్రధాన తారాగణానికే రూ. 42 కోట్ల వరకు అయింది. కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ‌లితం ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read :  సూపర్ స్టార్ కృష్ణ. మెగా స్టార్ చిరంజీవి ల కాంబినేషన్లో రెండవ సినిమా ఎందుకు మధ్యలోనే నిలించిపోయింది ?

Visitors Are Also Reading