Home » సూపర్ స్టార్ కృష్ణ. మెగా స్టార్ చిరంజీవి ల కాంబినేషన్లో రెండవ సినిమా ఎందుకు మధ్యలోనే నిలించిపోయింది ?

సూపర్ స్టార్ కృష్ణ. మెగా స్టార్ చిరంజీవి ల కాంబినేషన్లో రెండవ సినిమా ఎందుకు మధ్యలోనే నిలించిపోయింది ?

by AJAY
Ad

ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఒకే స్క్రీన్ పై క‌నిపిస్తే వ‌చ్చే కిక్కే వేరు. అందుకే ఒక హీరో చేసే సినిమాల కంటే మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇద్ద‌రు హీరోలు ఒకే స్క్రీన్ పై సంద‌డి చేస్తే ఆ ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ కూడా థియేటర్ లో ర‌చ్చ చేస్తారు. ఇక ఇప్పుడే కాదు ఒక‌ప్పుడే మ‌ల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ మొద‌ల‌య్యింది. ఒక‌ప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు సైతం క‌లిసి న‌టించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు.

Advertisement

ఇక అప్ప‌టి కుర్ర‌హీరోలు కూడా సీనియ‌ర్ హీరోల సినిమాల్లో న‌టించారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమాతో క‌లిసి నటించారు. వీరిద్ద‌రూ క‌లిసి తోడు దొంగ‌లు అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా వ‌చ్చిన కొన్ని నెల‌ల‌కే ఇద్దరి కాంబినేష‌న్ లో మ‌రోసినిమా చేయాల‌ని నిర్మాత బాబురావు అనుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కృష్ణ అన్న‌ద‌మ్ములుగా న‌టించాల్సి ఉంది. ద‌ర్శ‌కుడుగా కేఎస్ ఎస్ ఆర్ దాస్ ను ఎంపిక చేశారు. ఆ సినిమాకు అగ్నిజ్వాల అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

Advertisement

ఇక‌ బాబురావు సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో చెప్పి ఒప్పించారు. కానీ చిరంజీవికి చెప్ప‌గా ఆయ‌న డేట్స్ ఖాళీగా లేవ‌ని చెప్పారు. దాంతో బాబురావు అగ్నిజ్వాల సినిమాను ప‌క్క‌న పెట్టారు. అదే స‌మ‌యంలో క‌న్న‌డలో ఆసాద్య అలియా అనే సినిమా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. దాంతో నిర్మాత బాబు రావు ఆ సినిమా రీమేక్ హక్కుల‌ను సొంతం చేసుకున్నారు.

కృష్ణ‌కు క‌థ చెప్ప‌గా ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక ఆ సినిమాను మాయ‌దారి అల్లుడు పేరుతో రీమేక్ చేయ‌గా సినిమాలో కృష్ణ‌కు జంట‌గా జ‌య‌ప్ర‌ద న‌టించింది. ఈ సినిమాకు కేఎస్ ఆర్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా త‌ర‌వాత కూడా బాబురావు అగ్నిజ్వాల సినిమా స్క్రిప్ట్ ను బాబురావు వ‌దిలిపెట్ట‌లేదు. మోహ‌న్ బాబు న‌రేష్ కాంబినేష‌న్ లో ఆ సినిమాను తెర‌కెక్కించారు.

ALSO READ : ఎస్పీ బాలు లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. ఆ ఒక్క కారణంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారా..?

Visitors Are Also Reading