Home » వాట్సాప్ లో ఈ మెసేజ్ తో జరభద్రం !

వాట్సాప్ లో ఈ మెసేజ్ తో జరభద్రం !

by Bunty
Ad

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు, అందులో వాట్సాప్ లేని వారు పొరపాటున కూడా ఉండరు. అయితే ఇలాంటి టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైమ్ నేరాలు కూడా అలాగే పెరిగి పోతున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు కోట్లాదిమంది యూజర్లు వాట్సాప్ ను వాడుతున్నారు. చేతిలో ఫోను ఉందంటే వాట్సాప్ లోనే గంటల తరబడి గడిపే వాళ్ళు ఉంటారు. అయితే వాట్సప్ వాడుతున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఉంది వాట్సప్ యాజమాన్యం. ఎందుకంటే ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల టెక్నాలజీని అడ్డు పెట్టుకొని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ రోజుకో దగా చేస్తుండడం ఆందోళనకరంగా మారింది. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కన్ను వాట్సప్ యూజర్లపై పడింది.

Advertisement

Advertisement

సాధారణంగా మెసేజ్ వస్తుంది. అది మెసేజ్ మాత్రమే అయితే పర్లేదు కానీ అందులో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబరు ఉంటుంది. దానికి డబ్బు పంపాలని వేడుకుంటారు. అది మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ లు కూడా అనిపించవచ్చు. అయితే ఎలాంటి క్లారిటీ లేకుండా పొరపాటున మీ డబ్బులు పంపారు అంటే ఇక అంతే సంగతులు. ఇది కేవలం వాట్సాప్ లోనే మాత్రమే కాకుండా ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ ఇలా యాప్ లో కూడా జరుగుతోంది. కాబట్టి ఆన్లైన్లో ఉండేటప్పుడు జరభద్రం.

Visitors Are Also Reading