Ad
దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తాజాగా వచ్చిన ఈ సినిమా ఆర్ఆర్ఆర్. అయితే ఈ సినిమా అనౌన్సమెంట్ తోనే దీనిపైన ఆకాశం ఎత్తున అంచనాలు అనేవి ఏర్పడ్డాయి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. బాహుబలి వంటి భారీ గిట్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం… ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పెద్ద ,హీరోలు కలిసి నటించడం.. ఇక అన్ని కంటే ముఖ్యం ఈ సినిమా రియల్ హీరోస్ అయిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పైన రావడం.
ఇక అంచనాలకు తగ్గిన విధంగానే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కేవలం ఇండియాలోనే కాకుండా.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని దేశాల్లో హిట్ అయ్యింది. అందులో బ్రిటన్ కూడా ఉన్నది. కానీ బ్రిటన్ లో కొందరు మాత్రం.. ఈ సినిమాల్లో మమల్ని అవమానించారు అని.. బ్రిటిషర్లను తక్కువ చేసి చూపించారు అనే కామెంట్స్ చేసారు.
ఈ కామెంట్స్ పైన తాజాగా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాల్లో బ్రిటిష్ పాత్ర చేసిన వారిని విలన్ గా చూపించడం వల్ల.. మొత్తం బ్రిటిషర్లు అందరూ విలన్స్ అవ్వరు. అలానే అనుకుంటే మా సినిమా బ్రిటన్ లో ఎలా విజయం సాధించింది అని ప్రశ్నించారు. ప్రేక్షేకులకు తెలుసు.. అది కేవలం సినిమా.. అవి పాత్రలే అని అంటూ రాజమౌళి మంచి రిప్లయ్ అయితే ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ పై గంగూలీ కీలక ప్రకటన…!
బుమ్రా మళ్ళీ లేనట్లే.. చెప్పేసిన పాండ్య..!
Advertisement