Home » ఎన్టీఆర్ ‘కొమురం భీముడో’ సాంగ్‌ని ఇలా మార్చారేంట్రా బాబు..!

ఎన్టీఆర్ ‘కొమురం భీముడో’ సాంగ్‌ని ఇలా మార్చారేంట్రా బాబు..!

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR సినిమా విడుద‌ల‌కు ముందే  ఎమోష‌న‌ల్ వైబ్రేష‌న్ క్రియేట్ చేసింది. స్వాతంత్య్ర స‌మ‌ర యోధులైన కొమురం భీం, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల‌తో యుద్ధ వీర‌గాథ సృష్టించిన రాజ‌మౌళి ఈ సినిమా విడుద‌ల‌కు ముందే పాట‌లు ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించాయో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అందులో ముఖ్యంగా కొమురం భీముడో అంటూ సాగే వింటే రొమాలు నిక్క‌బొడుచుకుంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే.

Advertisement

 

సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట‌ను ఎం.ఎం.కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచారు. ఆయ‌న కొడుకు కాల‌భైర‌వ ప్రాణం పెట్టి పాడాడు. బానిస బ‌తుకులు.. సేచ్చాపోటాం, పోరాట కాంక్ష ర‌గిలే ఆవేశం వీటిన్నింటినీ హైలెట్ చేస్తూ డార్క్ బ్యాక్ గ్రౌండ్‌తో ప్ర‌త్యేకంగా ఈ పాట‌కు వీడియో షూట్ చేశారు. ఎన్టీఆర్ రూపాన్ని త‌ల‌పిస్తూ కాల‌భైర‌వ అభిన‌యించాడు. పాట‌కు తగిన ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ ఫీల్ ను పీక్స్‌కి తీసుకువెళ్లాడు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గోండులు వాడే లోక‌ల్ ప‌దాల‌తో సుద్దాల అశోక్ తేజ ఈ పాట‌ను రాశారు. అద్భుత‌మైన ప‌దాల‌ను వాడి కొమురం భీమ్ తెగువ‌ను చాటారు. కొర్రాయి, నెగ‌డు, కాల్మొక్తా బాంచెన్ వంటి ప‌దాల‌తో ప్ర‌త్యేక‌త చూపించారు.

Also Read :  య‌జ్ఞం సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..? ఆ కండిష‌న్ పెట్టడంతో..!


ఈ సినిమా విడుద‌లై చాలా రోజులు అయిన‌ప్ప‌టికీ అన్ని విడుద‌ల చేసిన ఈ సాంగ్ మాత్రం చాలా రోజుల త‌రువాత విడుద‌ల చేయ‌డం విశేషం. ఆడియ‌న్స్‌ని ఆకట్టుకున్న ఈ పాటతో ఎన్టీఆర్ త‌న న‌ట విశ్వ‌రూపం మొత్తం చూపించాడు. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ చూపించిన హావ భావాలు చూసి ఇలాంటి వారికి అయినా కంట‌త‌డి రాక త‌ప్ప‌దు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికీ కూడా ఏదో ఒక ఎడిటింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటుంటాయి. తాజాగా ఓ కొత్త వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ కొమురం భీముడో పాట‌కు డైరీ మిల్క్ యాడ్లోని కిస్ మీ క్లోజ్ యువ‌ర్ ఐస్ సాంగ్‌ని మిక్స్ చేసిన ఎడిటింగ్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. దీనిపై ప‌లువురు నెటిజ‌న్లు స్పందిస్తూ సాంగ్‌కు ఎన్టీఆర్ లిప్ మూవ్‌మెంట్ క‌రెక్ట్ గా సింక్ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Visitors Are Also Reading