Home » sep 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

sep 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తమిళనాడు సేలం జిల్లా అత్తూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమం గా ఉంది.

Advertisement

గుంటూరులో నేడు ఉదయం 11గంటలకు జనసేన లీగల్‌ సెల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పవన్‌కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, నాగబాబు పాల్గొనబోతున్నారు. పార్టీ లీగల్‌ సెల్‌కి కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. పవన్‌ చేపట్టబోయే యాత్ర ఏర్పాట్ల పై సమాలోచనలు చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ షాదుల్లా సహా ఇమ్రాన్‌, అబ్దుల్‌ అరెస్ట్‌ అయ్యారు. కరాటే శిక్షణ, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా భైంసా అల్లర్లతో సంబంధాలపై ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.

కేరళలో10 రోజుల పాటు రాహుల్ గాంధీ 201 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. ఇవాళ 20 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగింది. ఈ నెల 29 వరకు రాహుల్ యాత్ర కేరళలోనే కొనసాగనుంది.

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లు నిండి పోయాయి. రాంభగీచా అతిథి గృహం వరకూ భక్తులు క్యూలో నిలుచున్నారు.

విశాఖపట్నంలోని రుషికొండలో ఇన్ఫోటెక్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జీతాలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సామూహిక సెలవులు తీసుకున్నారు. పాత పెన్షన్ స్కీం అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు మూతపడ్డాయి.

డెబిట్,క్రెడిట్ కార్డుల పై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కార్డుల దుర్వినియోగం…సైబర్ నేరాల పై ఫిర్యాదు ల నేపథ్యంలో అక్టోబర్ 1 నుండి టోకేనైజేషన్ ను అమలు చేస్తున్నట్టు పేర్కొంది.

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో కొత్తగా 5,664 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గతం తో పోలిస్తే కరోనా కేసులు సంఖ్య మాత్రం భారీగా తగ్గింది.

Visitors Are Also Reading