Home » ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: కృతిసనన్ వలలో పడ్డ ప్రభాస్..ఇక నెక్స్ట్ పెళ్లేనా..?

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: కృతిసనన్ వలలో పడ్డ ప్రభాస్..ఇక నెక్స్ట్ పెళ్లేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇతర ఇండస్ట్రీలలో చాలా చిన్నచూపు ఉండేది.. తెలుగు ఇండస్ట్రీ హీరోలు అంటే కూడా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు తక్కువగా చూసేవారు.. జక్కన్న పుణ్యమా అని తెలుగు ఇండస్ట్రీ వైపు ఇండియా మొత్తం చూసే విధంగా చేశారని చెప్పవచ్చు. ఆయన మొదలుపెట్టిన పాన్ ఇండియా భారత దేశం దాటి ఇతర దేశాలకు కూడా పాకింది. తెలుగోడి టాలెంట్ ఏంటో నిరూపించారు. అలాంటిది జక్కన్న చేతిలో పడ్డ ప్రభాస్ మామూలు హీరో నుంచి పాన్ ఇండియా లెవెల్ లో ఎదిగి స్టార్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా తీయాలి అంటే చిన్నాచితకా నిర్మాతలు అయితే సరిపోరు. ఆయన రేంజ్ మారిపోయింది.

Advertisement

also read;శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ ట‌చ్‌కి ఆ క్ష‌ణం కంట్రోల్ త‌ప్పిన ప్రియ‌మ‌ణి.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Advertisement

ఇలా ఎంతో కష్టపడి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ తన పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అభిమానులు ఆయన పెళ్లి ఎప్పుడు అని కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వార్త బలంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ ఆ హీరోయిన్ తో లవ్ లో పడ్డారని, ఆ హీరోయిన్ కి కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టమని వార్తలు వస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో నటించిన కృతి సనన్.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని పుకార్లు వస్తున్నాయి.. ఇటీవలే ఆమె కాఫీ విత్ కరణ్ అనే షో లో పాల్గొంది..

ఇందులో కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ కి కృతిసనన్ ఫోన్ చేసింది.. ఆయనకు ఫోన్ చేసిన వెంటనే ప్రభాస్ మొదటి రింగ్ తోనే ఫోన్ లిఫ్ట్ చేయడంతో అది చూసిన వారంతా ప్రభాస్ కు మరియు కృతిసనన్ కి మధ్య లవ్ నడుస్తోందని, కృతిసనన్ అంటే అంత స్పెషల్ కాబట్టే ఆయన తొందరగా లిఫ్ట్ చేశారని అనుకుంటున్నారు.. అయితే అభిమానులు మాత్రం ఇది నిజమైతే బాగుండని వారి అభిమాన హీరో పెళ్లి కావాలని కోరుకుంటున్నారు.అలాగే ఈ షో లో కృతిసనన్ కూడా నాకు ఉన్న ఫ్రెండ్స్ లో ప్రభాస్ మాత్రం చాలా స్పెషల్ అంటూ బదులిచ్చింది. ఈ మాటతో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ నిజమే అంటూ భావిస్తున్నారు.

also read;ర‌హ‌స్యంగా న‌టి పూజిత పొన్నాడ‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ పెళ్లి…? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్….!

Visitors Are Also Reading