Home » sep 4th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

sep 4th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ధరల పెరుగుదలపై పార్లమెంట్ లో పోరాటం చేశాం మానిక్కం ఠాకూర్ అన్నారు. రోడ్లెక్కి ఆందోళనలు చేసామని….ఇవాళ రాంలీల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరు కొనసాగుతోందని అన్నారు.

Advertisement

ఆస్ట్రేలియాలోని ఆసిస్ తెలుగు అసోసియేషన్, బ్రిస్బేన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాలలో పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా పాల్గొనబోతున్నారు.

విజయవాడలో కుళ్ళిన మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట మార్కెట్ లో వీఎంసీ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర తనిఖీలు నిర్వహించారు. మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్ నగర్ లోని మార్కెట్లలో తనిఖీలు చేశారు. మాచవరంలో 5కేజీల కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు.

పుదుచ్చేరిలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకే ఫస్ట్ రావాలని ఓ తల్లి దారుణానికి పాల్పడింది. వేరే విద్యార్థికి శీతలపానీయంలో విషం ఇచ్చిన మహిళ.. పుదుచ్చేరిలోని కారైక్కాల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. 8వ తరగతి విద్యార్థి మణికందన్ కి స్కూల్ వాచ్ మెన్ ద్వారా కూల్‌డ్రింక్‌ లో విషం కలిపి ఇచ్చింది.

Advertisement

ఉమ్మడి జిల్లాలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 90.8 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. పిప్పల్ దరిలో 69.5 మి,మీ…. కొమురం భీం జిల్లా రవీంద్ర నగర్ లో 63.5 మి.మీ.. కెరమెరి లో 63.3 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది.

బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 10న ఖమ్మం లో పర్యటించనున్నారు. తెల్దారుపల్లి లో బండి సంజయ్ పర్యటిస్తారు. ఇటీవల హత్యకు గురైన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గద్దర్ వెళ్లారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కోరేందుకు గద్దర్ వెళ్లినట్టు సమాచారం.

శ్రీలంకలో బ్రెడ్ ధరలు తారస్దాయికి చేరుకున్నాయి. 450 గ్రాముల బ్రెడ్ ధర 300 లకు చేరుకుంది. దాంతో బ్రెడ్ కొనలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Visitors Are Also Reading