Home » ఇక స్మార్ట్ ఫోన్ కొంటే చార్జర్ ఉండదు.. ఎందుకంటే..!!

ఇక స్మార్ట్ ఫోన్ కొంటే చార్జర్ ఉండదు.. ఎందుకంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం ఏదైనా కొత్త మొబైల్ కొన్నప్పుడు దానికి చార్జర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ చార్జర్ ద్వారానే మన మొబైల్ కి చార్జింగ్ పెట్టుకుంటాం. కానీ ఇక నుంచి సెల్ ఫోన్ లకు చార్జర్ అనేది కనిపించదట.. దీనికి ప్రధాన కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటికే శ్యామ్ సంగ్, యాపిల్ వంటి ఫోన్లలో చార్జర్లు రావడం లేదు. ఎందుకంటే ఆయా కంపెనీలపై చార్జర్ ల వ్యయ భారం తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణంలో వ్యర్థాలను కూడా తగ్గించవచ్చు..

Advertisement

also read;మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..?

Advertisement

చార్జర్ కొనుక్కోవాలంటే విడిగా కొనుక్కోవలసిందే. ప్రస్తుతం చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.. ఒక ఫోన్ కొన్న తర్వాత ఆ ఫోన్ పాడైతే మరో ఫోన్ కొంటారు.. అయితే ఆ పాత ఫోన్ యొక్క చార్జర్ అనేది బాగానే ఉంటుంది. కాబట్టి కొత్త ఫోన్ కొంటే మళ్లీ పాత ఫోన్ చార్జర్ మనము ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అది కూడా పాడైతే విడిగా మనం చార్జర్ కొనుక్కో వలసిందే. దీని కోసం కేంద్ర సర్కార్ అన్ని కంపెనీల ఫోన్లకు యు ఎస్ బి టైప్ సీ చార్జింగ్ పోర్టును పెట్టాలని కంపెనీలు భావిస్తున్నాయి.

అయితే ఇది అన్ని కంపెనీలకు కాకుండా కొన్ని కంపెనీలకు మాత్రమే అమలు కానుంది.. వచ్చే ఏడాది నుంచే ఈ చార్జర్ తొలగింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. దీనికి సంబంధించి ఒప్పో ఓవర్సీస్ సేల్స్ అధ్యక్షుడు బిల్లీ జంగ్ తెలియజేశాడు. ఈ చార్జర్ లను బాక్స్ నుండి తొలగించి స్టోర్లలో అందుబాటులో ఉంచాలని అన్నారు. భవిష్యత్తులో అన్ని కంపెనీలకు ఇదే విధానం అమలు అయ్యేలా కనిపిస్తోంది.

also read;ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప‌వ‌ర్ స్టార్ బిరుదు రావ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading