నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్‌ను అకస్మాత్తుగా ఆదివారం అధికారులు కూల్చేశారు. మధ్యాహ్నం సమయంలో వాటర్ పాల్ టెక్నిక్‌ని ఉపయోగించి బటన్ నొక్కి జంట భవనాలను ఒక్కసారిగా నేటమట్టం చేశారు. ఇదంతా కేవలం 9 సెకన్లలోనే ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ఈ టవర్స్ ని కూల్చడానికి 3,700 పేలుడు పదార్థాలను ఉపయోగించారట.
ఇవి కూడా చదవండి : ఇంజినీరింగ్ చదవాలనుకుంటే అటానమస్ కాలేజీలో చదవండి.. మీకు ఫుల్ బెనిఫిట్స్..!
Advertisement
ఇక ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో చుట్టు పక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. కూల్చివేసిన ప్రక్రియకి ముందుగానే పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్ చుట్టు పక్కల ఉన్న స్థానికులను ముందుగానే తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అయితే సమీపంలో షెల్టర్ కల్పించిన వారు మాత్రం ఆదివారం ఉదయం వరకు తమ ఫ్లాట్లలోనే ఉన్నారు. ఉదయం 7 గంటలకే వారు అక్కడి నుంచి షెల్టర్ కేంద్రాలకు వెళ్లారు.
Advertisement
ఇవి కూడా చదవండి : షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు.. వారు ప్రాణాలను ఎలా కాపాడుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక ఉండరు..!
ఇదంతా జరిగినా కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంట్లో అలాగే పడుకుని ఉన్నాడు. ట్విన్ టవర్స్‌కి సమీపంలో ఉన్నటువంటి అపార్టుమెంట్‌లోని టాప్ ఫ్లోర్‌లో గాఢంగా నిద్రిస్తూ ఉండిపోయాడు. ఖాళీ చేయాలని చెప్పిన సమయానికి అతడు నిద్రలోనే ఉన్నాడు. ఇక ఈ జంట టవర్ల కూల్చివేతకు ముందు చివరిసారి అన్ని చోట్లలో తనిఖీలు నిర్వహించారు. ఇలా తనిఖీలు చేస్తున్న సమయంలోనే ఓ టవర్‌లోని పై అంతస్తు ఫ్లాట్‌లో నిద్రిస్తున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. వెంటనే టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో అతడిని నిద్రలేపి అక్కడి నుంచి షెల్టర్‌కి పంపారు. ఇక కూల్చివేసే సమయంలో ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మూలంగానే సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్టు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తెలిపినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి : ప్రముఖ నటుడు వడ్డే నవీన్ భార్య ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!