Home » ఇంజినీరింగ్ చ‌ద‌వాల‌నుకుంటే అటాన‌మ‌స్ కాలేజీలో చ‌ద‌వండి.. మీకు ఫుల్ బెనిఫిట్స్‌..!

ఇంజినీరింగ్ చ‌ద‌వాల‌నుకుంటే అటాన‌మ‌స్ కాలేజీలో చ‌ద‌వండి.. మీకు ఫుల్ బెనిఫిట్స్‌..!

by Anji
Ad

భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం ఇంజినీరింగ్ క‌ళాశాలలు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో అటాన‌మ‌స్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు చాలా ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంటున్నాయి. సాధార‌ణంగా ఇంజినీరింగ్ కాలేజీలు ఏదో ఓ యూనివ‌ర్సిటీకి అనుబంధంగా ఉంటాయి. కానీ అటాన‌మ‌స్ క‌ళాశాల‌లు స్వ‌తంత్రంగా ప‌ని చేస్తాయి. అందుకోస‌మే వాటికి రోజు రోజుకు ప్రాముఖ్య‌త పెరుగుతోంది.

ఇవి కూడా చ‌దవండి :  శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ చేసిన ఈ లేడీ కండ‌క్ట‌ర్ పారితోషికం ఎంత తీసుకుందో తెలుసా..?

Advertisement

ఆయా కాలేజీల్లో అందుబాటులో ఉండే బోధ‌న ప్ర‌మాణాలు, మౌళిక స‌దుపాయాలు, పాల‌నా సౌక‌ర్యం త‌దిత‌ర అంశాల ఆధారంగా క‌ళాశాల‌కు అటాన‌మ‌స్ స్టేట‌స్ ఇస్తుంటారు. ఇలాంటి క‌ళాశాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు త్వ‌ర‌గా ఉద్యోగాలు ల‌భించే అవ‌కాశం ఉంది. యూనివ‌ర్సీటీల‌కు అనుబంధంగా ప‌ని చేసే క‌ళాశాల‌లు యూనివ‌ర్సిటీ మీద ఆధ‌ర‌ప‌డాలి. యూనివ‌ర్సీటీలు ఇచ్చే తేదీల ప్ర‌కారం.. క్లాస్‌లు, ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. కానీ అటాన‌మ‌స్ క‌ళాశాలలో అలా ఉండ‌దు. సొంతంగానే సిల‌బ‌స్, అకాడ‌మిక్ క్యాలెండ‌ర్‌ని వీరే స్వ‌యంగా రూపొందించుకోవ‌చ్చు. వీరికి వెసులుబాటును బ‌ట్టి సెమిస్ట‌ర్ల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. మిగ‌తా క‌ళాశాల‌ల క‌న్న వేగంగా ప‌రీక్ష‌ల‌నునిర్వ‌హించ‌వ‌చ్చు. దీంతో విద్యార్థుల‌కు దీర్ఘ‌కాలం పాటు ప‌రీక్ష‌లు, ఫ‌లితాల కోసం ఎదురు చూడాల్సిన అవ‌స‌రమే లేదు.


అటాన‌మ‌స్ క‌ళాశాల‌లు స్వ‌తంత్రంగా ప‌ని చేయ‌డం ద్వారా పారిశ్రామిక‌, కార్పొరేట్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌ను విద్యార్థుల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న కోర్సుల‌ను కూడా అందించ‌వచ్చు. దీంతో విద్యార్థులు ఎప్ప‌టిక‌ప్పుడు మార్కెట్ ట్రెండ్‌ని బ‌ట్టి ముందుకు సాగ‌వ‌చ్చు. ఇక క‌ళాశాల‌లో విద్య ముగిసిన వెంట‌నే జాబ్ ల‌భించేందుకు అవ‌కాశ‌ముంటుంది. అదేవిధంగా ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీల డిమాండ్ మేర‌కు అటాన‌మ‌స్ క‌ళాశాల నైపుణ్యం క‌లిగిన విద్యార్థుల‌ను త‌యారు చేస్తుంది. దీంతో కంపెనీల‌కు కావాల్సిన నైపుణ్యం క‌లిగిన ఉద్యోగులు వెంట‌నే ల‌భిస్తారు.

ఇవి కూడా చ‌దవండి :

Advertisement

అటాన‌మ‌స్ క‌ళాశాలల్లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్కెట్ కు అనుగ‌ణంగానే విద్య‌ను బోధిస్తుంటారు. ఇక సిల‌బ‌స్‌, ప‌రీక్ష‌లు కూడా అదేవిధంగా ఉంటాయి. అటాన‌మ‌స్ క‌ళాశాల‌లు ఎక్కువ‌గా ప్రాజెక్టులు, యాక్టివిటీల‌ను, ఇంట‌ర్న్‌షిప్‌ల‌ను నిర్వ‌హిస్తుంటాయి. దీంతో విద్యార్థుల‌కు కెరీర్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. వారి ఉద్యోగ అవ‌కాశాల‌ను పెంచుతుంది. కెరీర్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించ‌వ‌చ్చు. అటాన‌మ‌స్ క‌ళాశాల‌లు అక్రిడిటేష‌న్‌ని క‌లిగి ఉండి అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో నాణ్య‌మైన విద్యాబోధ‌నను అందిస్తుంటాయి. ఆ క‌ళాశాల‌ల్లో చదివే విద్యార్థుల‌కు ఇత‌ర యూనివ‌ర్సిటీలు ప్రాధాన్య‌త‌ను ఇస్తాయి. అదేవిధంగా కంపెనీలు కూడా వారికే తొలి ప్రాధాన్య‌త క‌ల్పిస్తాయి. అటాన‌మ‌స్ కాలేజీ విద్యార్థులు త‌మ‌కు న‌చ్చిన స‌బ్జెక్టుల‌ను ఎంచుకుని ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్ట‌మ్‌ని ఫాలో అవ్వొచ్చు. త‌మ స్కిల్స్‌ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

అటాన‌మ‌స్ కాలేజీల‌లో అందించే ఫుల్‌టైం ఇంట‌ర్న్‌షిప్‌లు విద్యార్థుల‌కు చాలా మేలు చేకూరుస్తాయి. కార్పొరేట్ కంపెనీల‌తో వారికి టై ఆప్స్ ఉంటాయి. ఈ విద్యార్థులు ఇత‌ర క‌ళాశాల‌ల విద్యార్థులు కంటే ముందుగానే ఇంట‌ర్న్‌షిప్‌లు చేసి జాబ్‌ల‌కు సిద్ధం అవ్వ‌వ‌చ్చు. ఇత‌ర క‌ళాశాల‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, ఫ‌ల‌తాల‌ను ప్ర‌క‌టించ‌డం కాస్త ఆల‌స్య‌మ‌వుతుంది. అటాన‌మ‌స్ క‌ళాశాల‌ల్లో ఈ ప్ర‌క్రియ చాలా వేగ‌వంతంగా జ‌రుగుతుంది. దీంతో విద్యార్థుల‌కు స‌మ‌యం ఎంతో ఆదా అవుతుంది. పాఠ్యాంశాల్లోవెనుక‌బ‌డే విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ సెమిస్ట‌ర్లు నిర్వ‌హిస్తారు. దీంతో చ‌దువులో వెనుక‌బ‌డిన విద్యార్థులకు చాలా మేలు జ‌రుగుతుంది.

ఇవి కూడా చ‌దవండి :  సూప‌ర్ స్టార్ కృష్ణ కొడుకు ర‌మేష్ బాబు ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడు..!


ఇక అటాన‌మ‌స్ క‌ళాశాలల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రెడిట్ ట్రాన్స్‌ఫ‌ర్ వ్య‌వ‌స్థ ఉంటుంది. అటాన‌మ‌స్ క‌ళాశాలల్లో చ‌దివే విద్యార్థులు ఏదైనా అంత‌ర్జాతీయ క‌ళాశాల లేదా యూనివ‌ర్సిటీకీ మారితే అక్క‌డ క‌ళాశాల‌ల్లో ఆ విద్యార్థికి క్రెడిట్స్ ని అక్క‌డి క‌ళాశాల లేదా యూనివ‌ర్సిటీకి సుల‌భంగా ట్రాన్స్ ప‌ర్ చేసుకోవ‌చ్చు. ఏ కాలేజికి అయినా అటాన‌మ‌స్ స్టేట‌స్ ఇచ్చే అధికారం యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (UGC)కి ఉంటుంది. ఒక క‌ళాశాల 10 ఏళ్ల నుంచి సేవ‌లందిస్తుండాలి. దానికి నాక్ (NAC) అక్రిడిటేష‌న్ క‌నీసం ఏ గ్రేడ్ ఉండాలి. లేదంటే ఎన్‌బీఏ అక్రిడిటేష‌న్ స్కోరు క‌నీసం 675 ఆపైన ఉండాలి. క‌నీసం 3 అకాడ‌మిక్ ప్రోగ్రామ్‌ల‌లో ఆ స్కోరు ఉండాలి. దీంతో ఆ క‌ళాశాల‌కు అటాన‌మ‌స్ స్టేట‌స్ ఇస్తారు.

ఇవి కూడా చ‌దవండి :  ఉడికించిన వేరు శ‌న‌గ‌లు తింటున్నారా..? ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Visitors Are Also Reading