విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన 2011లో వచ్చిన నువ్విలా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, 2016లో వచ్చిన పెళ్లి చూపులు వంటి సినిమాలతో ప్రశంసలు అందుకున్నాడు. 2017లో బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి సినిమాతో తనంతట తాను ఓ బ్రాండ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ని ఓ మలుపు తిప్పిందనే చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి : ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాసరి శత్రువులు కావడానికి కారణం ఎవరో తెలుసా..?
Advertisement
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్‌రెడ్డి సినిమా ఇప్పటికే ఐదు సంవత్సరాలను కూడా పూర్తి చేసుకుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఒక సీన్ ప్రస్తుతం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. అర్జున్‌రెడ్డి సినిమా విడుదలై ఐదేళ్లు అయినప్పటికీ ఈ సినిమాకి మాత్రం ఇంకా క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇందులో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్‌లు ఇప్పటికీ జనాలకు పిచ్చెక్కిస్తున్నాయని వీడియో ద్వారా మరోసారి నిరూపించారు డైరెక్టర్ సందీప్‌రెడ్డి. 2నిమిషాల 53 సెకన్ల నిడివి గల ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి : కొరటాల స్టార్ డైరెక్టర్ అవ్వడానికి సింహా సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఆ మోసం తరవాతే..?
ఈ చిత్రంలో అర్జున్‌రెడ్డి ప్రీతిని టెర్రస్ పై Muద్దు పెట్టుకుంటుండగా తన తండ్రి వచ్చి తనని తిట్టి తీసుకెళ్తారు. ఆ సన్నివేశం తరుత వచ్చే సీన్ డిలీట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది. అమ్మ నాన్నమ్మ పది రోజుల గ్యాప్ తరువాత నన్ను కలిస్తే వాళ్లు ప్రేమతో నన్ను హగ్ చేసుకుని Muద్దు పెడతారు. ఆ రోజు టెర్రస్ పై ప్రీతికి నేను పెట్టినది కూడా అలాంటిదే అని విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంత మంచి సీన్ సినిమాలోంచి ఎందుకు కట్ చేశారంటూ అభిమానులు భావిస్తున్నారు. ఐదు సంవత్సరాల కిందట ఆగస్టు 25న విడుదలై సూపర్ హిట్ సాధించిన అర్జున్‌రెడ్డి సూపర్ హిట్ కావడంతో అదే సెంటమెంట్తో లైగర్ సినిమాని విడుదల చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి : పారిపోయిన యూట్యూబర్.. అతని ఆచూకి చెప్పిన వారికి రూ.25వేల రివార్డ్..!