Home » ఐపీఎల్‌ తో పోటీకి సిద్ధమైన పీఎస్ఎల్..!

ఐపీఎల్‌ తో పోటీకి సిద్ధమైన పీఎస్ఎల్..!

by Azhar
Ad
పాకిస్థాన్ అనేది ఇండియాను పోటీ ఇవ్వాలి అని అనుకుంటుంది. కానీ అది ఎప్పుడు కుదరదు. మన బీసీసీఐ 2008 లో ఐపీఎల్ ను ప్రారంభించి లాభాలు భారీగా ఆర్జిస్తుంటే అది చూసి పీఎస్ఎల్ అంటే పాకిస్థాన్ సూపర్ అనే టోర్నీని ప్రారంభించింది. కానీ అది మన ఐపీఎల్ లో 10 మ్యాచ్ ల విలువ కూడా ఉండదు. కానీ ఇప్పుడు దానిని మన ఐపీఎల్ తో పోటీకి తేవాలని పాక్ చూస్తుంది.
అయితే ఐసీసీ 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ హక్కులను పాకిస్థాన్ కు ఇచ్చింది. ఈ టోర్నీ అనేది ఫిబ్రవరిలో జరగాలి. కానీ పీఎస్ఎల్ కూడా పాక్ బోర్డు ఫిబ్రవరిలోనే నిర్వహిస్తుంది. అందుకే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీఎస్ఎల్ మార్చ్ – మే మధ్యలో అంటే సరిగ్గా మన ఐపీఎల్ జరిగే సమయంలోనే నిర్వహించాలని పాక్ బోర్డు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
అయితే ఐపీఎల్ లో ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లు అందరూ పాల్గొంటారు. కానీ కొంతమంది ప్లేయర్స్ మన ఐపీఎల్ తో పాటుగా పీఎస్ఎల్ లో ఆడుతుంటారు. కాబట్టి వారికీ ఇబ్బంది అనేది వస్తుంది. ఇక ఐపీఎల్ వాటి పెద్ద టోర్నీతో నేరుగా పోటీ పడే ధైర్యం అప్పటికి పీఎస్ఎల్ లో ఉండదు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ అలానే చేసిన ఆటగాళ్లు అందరూ మన ఐపీఎల్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు అనే విషయంలో ఎవరికి అనుమానమే ఉండదు. కాబ్బటి పాక్ ఆ పని చేయకపోవచ్చు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading