Home » తన కొత్త జట్టును ప్రకటించిన ఎంఐ..!

తన కొత్త జట్టును ప్రకటించిన ఎంఐ..!

by Azhar
Ad
ఐపీఎల్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెగ క్రేజ్ అనేది తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ ను చూసి ఇప్పటికే చాలా దేశాల బోర్డులు తమ తమ క్రికెట్ లీగ్స్ అనేవి నిర్వహిస్తున్నాయి. కానీ వాటికీ ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ లో సగం కూడా లేదు. ఇక వచ్చే ఏడాది నుండి మరో రెండు కొత్త లీగ్స్ వస్తున్నాయి. అందుకే యూఏఈ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ లీగ్ అనేది కూడా ఉంది.
అయితే ఈ లీగ్ పై కొన్ని అంచనాలు ఉన్నాయి. అందుకు కారణమా ఇందులోని ఒక్క జట్టును ఐపీఎల్ లో ఎంతో సక్సెస్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకుంది. ఆ జట్టుకు ఏంఐ ఎమిరేట్స్ అనే పేరును కూడా పెట్టింది. ఇక తాజాగా ఈ జట్టులో ఆడే ఆటగాళ్ల జాబితాను కూడా ఏంఐ జట్టు విడుదల చేసింది. అయితే ఆ జట్టులో వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు అనే చెప్పాలి. ఇక ఐపీఎల్ లో రోహిత్ లేన్నపుడు ముంబై జట్టును నడిపే పోలార్డ్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. అతనే ఆ జట్టును నడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఏంఐ ఎమిరేట్స్ జట్టు : కీరన్ పొలార్డ్, ట్రెంట్ బౌల్ట్ డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, నజీబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్,  ఆండ్రీ ఫ్లెచర్, విల్ స్మీడ్, జోర్డాన్ థాంప్సన్, ఫజల్హాక్ ఫరూకీ, బ్రాడ్లీ వీల్, బాస్ డి లీడే, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్

Advertisement

Visitors Are Also Reading