Home » భారత జింబాంబ్వే పర్యటనలో మరో మార్పు..!

భారత జింబాంబ్వే పర్యటనలో మరో మార్పు..!

by Azhar

ఐపీఎల్ 2022 సీజన్ అనేది ముగిసిన తర్వాత భారత జట్టు అనేది తీరిక లేని క్రికెట్ అనేది ఆడుతుంది. సౌత్ ఆఫ్రికాతో ఇండియాలో పోటీ పడిన తర్వాత ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్ పర్యటనలు అనేది ముగించుకుంది. ఇక ఇప్పుడు టీం ఇండియా జింబాంబ్వే పర్యటనకు వెళ్తుంది. జింబాంబ్వే పర్యటన అనేది భారత జట్టు ఆరేళ్ళ తర్వాత చేస్తుంది. అయితే ఈ టూరు యొక్క జట్టును ఎప్పుడో ప్రకటించిన బీసీసీఐ ధావన్ ను కెప్టెన్ గా నియమించింది.

అయితే ఈ టూర్ కు మొదట్లో అందుబాటులో లేని కేఎల్ రాహుల్.. మళ్ళీ అందుబాటులోకి రావడంతో కెప్టెన్సీ పగ్గాలను రాహుల్ కే ఇస్తున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది. ఇక దీనిపైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ జింబాంబ్వే పర్యటనలో మరో మార్పు కూడా జరిగింది. తాజాగా ఈ టూర్ యొక్క హెడ్ కోచ్ ను మార్చేసింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జే షా ప్రకటించారు.

టీం ఇండియా ప్రధాన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విశ్రాంతి తీసుకోవడం లేదు. కానీ ఈ నెల 20న ఆసియా కప్ కోసం టీం ఇండియా యూఏఈకి వెళ్తుంది. కాబట్టి ఆ జట్టుతో ద్రావిడ్ వెళ్తారు. ఇక 22 వరకు ఉండే జింబాంబ్వే టూర్ కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవరిస్తారు అని జే షా పేర్కొన్నాడు. ఇక ఈ మధ్యే ఐర్లాండ్ కు వెళ్లిన భారత బి జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

తన కొత్త జట్టును ప్రకటించిన ఎంఐ..!

పాకిస్థాన్ పరువు తీసిన సెహ్వాగ్..!

Visitors Are Also Reading