హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఓ మహిళతో newడ్ గా వీడియోకాల్‌లో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. దానిపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వీడియో తనది కాదని చెబుతున్నారు ఎంపీ గోరంట్ల మాదవ్. ఈ విషయంపై తాను ఏ విచారణకైనా సిద్ధం అని.. ఎంపీ స్పష్టం చేశారు. ఎంపీ గోరంట్ల మాదవ్ తాను జిమ్‌లో ఉన్న సమయంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారని పేర్కొంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ వీడియో ఇలా వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఎంపీ గోరంట్ల మాదవ్ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. ఇక వ్యవహారాన్ని ఏపీ సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఎంపీ గోరంట్ల వ్యవహారం గురించి ప్రాథమిక సమాచారం తెప్పించుకున్నారు. సజ్జలను రెండు సార్లు పిలుపించుకుని ఈ విషయంపై ఆరా తీశారు సీఎం జగన్. మరోవైపు ఎంపీ మాదవ్ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల స్పందించారు. ఎంపీ మాదవ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అది మార్ఫింగ్ వీడియో అని ఎంపీ గోరంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాచారణ జరుగుతుంది. అది మార్ఫింగ్ కాదని తేలితే.. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మహిళలను కించ పరిచే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని పార్టీ సహించదని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
అసలు ఏం జరిగిందంటే..? రెండు రోజుల కిందట ఎంపీ గోరంట్ల ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆసమయంలో అతను దుస్తులు లేకుండా ఉన్నారని.. ఇది చూసిన ఆ మహిళ ఎంపీ చిత్రాలను చూసి సీరియస్ గా తీసుకొని వైరల్ చేసింది. ఈ విషయంపై గోరంట్ల జిమ్ చేసినప్పటి వీడియోలను మార్పింగ్ చేసారని పేర్కొన్నారు. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని పేర్కొంటున్నారు ఎంపీ గోరంట్ల. ఈ విషయం పై జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాను. ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంకోర్టులకు కూడా వెళ్తానన్నారు. తన పరువుకు భంగం కలిగించిన వారందరిపై దావా వేస్తానని వెల్లడించారు. మరో వైపు ఎంపీ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read :
పుష్ప-2లో నటించనున్న సమంత.. ఆమె పాత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
భర్తల వద్ద భార్యలు రహస్యం గా ఉంచే నాలుగు విషయాలు ఇవేనట..!