Home » పుష్ప-2లో న‌టించ‌నున్న స‌మంత‌.. ఆమె పాత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పుష్ప-2లో న‌టించ‌నున్న స‌మంత‌.. ఆమె పాత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌మంత అంద‌రికీ సుప‌రిచ‌త‌మే. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన స‌మంత టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ తోపాటు ఓ హ‌లీవుడ్ సినిమాలో కూడా న‌టిస్తోంది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తోంది ఈబ్యూటీ. ఇలా జోరు మీద ఉన్న ఈ బామ బ‌న్నీ ఫ్యాన్స్‌ని ఊహించ‌ని విధంగా స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత చేతిలో ఉన్న సినిమాల‌న్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావ‌డం విశేషం.


తాజాగా వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోనూ న‌టించ‌బోతుంద‌ట‌. ఆయ‌న అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ చేసే పాత్ర‌లో సమంత న‌టించ‌బోతుంద‌ట‌. ఇప్ప‌టికే స‌మంత పుష్ప సినిమాలో ఊ అంటావా మావ‌.. ఉఊ అంటావా అంటూ కొన‌సాగే ఈ పాట‌లో నెవ‌ర్ బిఫోర్ అనేవిధంగా ఆక‌ట్టుకుంటుంది స‌మంత‌. ఇక ఆ పాపులారీటిని ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌ళ్లీ వాడుకోబోతున్నార‌ట‌. ఇక సారి సాంగ్ లో కాకుండా సెప‌రెట్‌గా స‌మంత కోసం ఓ పాత్ర‌ని డిజైన్ చేస్తున్నార‌ట‌. పుష్ప‌-2లో స‌మంత పాత్ర చాలా కీల‌కం కానుంద‌ట‌. ముఖ్యంగా ఆమె పుష్ప‌రాజ్‌కి స‌హాయం చేసే స్నేహితురాలి పాత్ర‌లో క‌నిపించ‌బోతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement


పుష్ప రెండో పార్ట్‌లో శ్రీ‌వ‌ల్లి పాత్ర మ‌ధ్య‌లోనే చ‌నిపోతుంద‌ని.. కానీ ఆమె పుష్ప‌రాజ్ మెమొరీలో మాత్రం చాలా సేపు ర‌న్ అవుతోంద‌ని టాక్. ఆమె చ‌నిపోయిన తరువాత ఆ లోటుని భ‌ర్తీ చేసే విధంగా స‌మంత రోల్ ఉంటుంద‌ని స‌మాచారం. ఇందులో నిజ‌మెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక మ‌రోవైపు స‌మంత హిందీలో వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో దూసుకెళ్తోంది. ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమాకి క‌మిట్ అయింది. ఇక అక్ష‌య్ కుమార్‌తో కూడా ఓ సినిమా ఒకే అయిన‌ట్టు తెలుస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ తో కూడా కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసింద‌ట‌. మ‌రోవైపు స‌మంత ముంబ‌యికి మ‌కాం మార్చింది. తాజాగా ముంబ‌యి ఎయిర్ పోర్ట్ లో స‌మంత ల‌గేజీ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్‌తో క‌నిపించ‌గా.. ఆమె ఫోటోల‌ను అభిమానులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

Also Read : 

రెమ్యూన‌రేష‌న్‌ను భారీగా పెంచిన‌ ప‌విత్ర లోకేష్.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

బాల‌కృష్ణ ఆ హీరోయిన్ ని ల‌వ్ చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading