Home » మీరు వాకింగ్ చేస్తున్నారా..? వాకింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు చేయ‌కుండా ఉండ‌రు..!

మీరు వాకింగ్ చేస్తున్నారా..? వాకింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు చేయ‌కుండా ఉండ‌రు..!

by Anji
Ad

సాధార‌ణంగా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది అని చాలా మంది చెబుతుంటారు. ఓ వైపు డాక్ట‌ర్లు, మ‌రోవైపు ఫ్రెండ్స్‌, కుటుంబ స‌భ్యులు, బంధువులు ఇలా ఎవ‌రో ఒక‌రూ వాకింగ్ గురించి చెబుతుంటారు. కొంత‌మంది వారు చెప్ప‌గానే రెండు మూడు రోజుల పాటు వాకింగ్ కొన‌సాగిస్తారు. ఇక ఆ త‌రువాత వాయిదా వేస్తుంటారు. కొంత మంది మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


ప్ర‌తి రోజు ఒక అరగంట సేపు న‌డ‌వ‌డం ద్వారా బ‌రువు పెంచే జ‌న్యువుల ప్ర‌భావాల‌ను న‌డ‌క తిప్పికొడుతుంది. హార్వార్డ్ విశ్వ‌విద్యాల‌య అధ్య‌యనంలో తేలిన విష‌యం ఇది. ఊబ‌కాయాన్ని ప్రేరేపించే 32 ర‌కాల జ‌న్యువుల ప‌ని తీరును ప‌రిశీలించ‌గా.. రోజుకు సుమారు గంట‌సేపు న‌డిచిన వారిలో వీటి ప్ర‌భాం సగం వ‌ర‌కు త‌గ్గ‌డం విశేషం. అదేవిధంగా ప్ర‌తి రోజు న‌డ‌వ‌డం ద్వారా తీపి ప‌దార్థాల మీదికి మ‌న‌సు వెళ్ల‌కుండా ఉంటుంది. క‌నీసం 15 నిమిషాల పాటు న‌డిచినా చాక్లెట్లు తినాల‌నే కోరిక త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్టు ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు చాక్లెట్లు తిన‌డం తగ్గుతున్న‌ట్టు ఎక్స్‌ట‌ర్ విశ్వ‌విద్యాల‌య ప‌రిశోద‌కులు గుర్తించారు.

Advertisement

Advertisement


ఒక్క చాక్లెట్లకే ప‌రిమితం కావ‌డం లేదు. ఇదంతా తీపి ప‌దార్థాల‌ను తినాల‌నే కోరిక త‌గ్గుతోంది. ఎలాంటి శారీర‌క శ్ర‌మ అయినా రొమ్ము క్యాన్స‌ర్ ముప్పు త‌గ్గ‌డానికి తోడ్ప‌డేదే. ఒక్క న‌డ‌క‌తోనే ఇది సాధ్యం అవుతున్న‌ట్టు అమెరిక‌న్ క్యాన్స‌ర్ సొసైటీ అధ్య‌య‌నం పేర్కొంటుంది. వారానికి 7 గంట‌లు, అంత‌క‌న్నా ఎక్కువ సేపు వాకింగ్ చేసిన మ‌హిళ‌ల‌లో రొమ్ము క్యాన్స‌ర్ ముప్పు 14 శాతం మేర‌కు త‌గ్గనున్న‌ట్టు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. అధిక బ‌రువు, హార్మోన్ మాత్ర‌లు వేసుకోవ‌డం వంటి వారికి ఈ రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదేవిధంగా కీళ్ల వాపుతో త‌లెత్తే నొప్పులు త‌గ్గ‌డానికి న‌డ‌క దోహ‌దం చేస్తున్న‌ట్టు ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. స‌మ‌స్య అంత‌వ‌ర‌కు రాకుండా కాపాడుతుంది.

వారానికి ఐదు ఆరు కిలో మీట‌ర్లు న‌డ‌వ‌డం కీళ్ల వాపు నివారణ‌కు తోడ్ప‌డుతున్న‌ట్టు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. న‌డ‌వ‌డం వ‌ల్ల కీళ్లు ముఖ్యంగా ఎక్కువ‌గా అరిగిపోయే అవ‌కాశం ఉన్న మోకీళ్లు, తుంటి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కండ‌రాలు బ‌లోపేత‌మ‌వుతాయి. కీళ్లు ఒరుసుకుపోవ‌డం త‌గ్గి క‌ద‌లిక‌లు సాఫీగా సాగుతాయి. న‌డ‌వ‌డం ద్వారా రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. వారానికి ఒక‌సారి వ్యాయామం చేసే వారితో పోల్చితే.. రోజుకు క‌నీసం 20 నిమిషాల పాటు న‌డిచిన వారికి జ‌లుబు, ప్లూ వంటి ఇన్‌ఫెక్ష‌న్ల ముప్పు 43 శాతం త‌క్కువ‌గా ఉంటున్న‌ట్టు అధ్య‌య‌నాలు పేర్కొంటున్నాయి. ఒక‌వేళ వాకింగ్ చేసే వారికి ఏవైనా జ‌బ్బులు వ‌చ్చినా త్వ‌ర‌గా కోలుకుంటడం విశేషం.

Also Read : 

మీకు అధికంగా చెమ‌ట‌లు ప‌డుతున్నాయా..? అయితే కార‌ణం అదే..!

జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ no 1 సినిమా తీయనని ఎందుకు రాజమౌళి మొదట అన్నారు ?

Visitors Are Also Reading